పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ముందు తాను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో ధైర్యంగా తెలియచేసాడు, కడన పూర్వవేద ప్రవచనాలు పరిపూర్ణంగా నెరవేరి ఆ యంతిమ గడియ రానేవచ్చింది. క్రీస్తు విధేయతతో, ఇష్టపూర్తిగా, ధైర్యంగా విజయనాదం చేస్తూ తన ప్రాణాన్ని తండ్రికి అర్పించాడు. ఆ యర్పణం ద్వారానే నేడు మనకు పాప విమోచనం కలిగింది.

లూకా సువిశేషం ప్రకారం క్రీస్తు "తండ్రీ! నా యాత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని పల్కి ప్రాణం విడిచాడు - లూకా 28,46. ఈ వాక్యం 31వ కీర్తన 5వ చరణంలోనిది. అక్కడ కీర్తనకారుడు దేవునికి ఈలా మొరపెట్టాడు :

నా యాత్మను నీ చేతుల్లోనికి అర్పించుకొంటున్నాను
ప్రభూ! నీవు నన్ను కాపాడావు
నీవు నమ్మదగిన దేవుడివి.

లూకా గ్రంథం ప్రకారం మరణానికి ముందు క్రీస్తు ఈ వేదవాక్యాలను తనకు అన్వయించుకొన్నాడు. అనగా అతడు తండ్రిని పూర్తిగా నమ్మి తన ప్రాణాలను అతని చేతుల్లోనికి అర్పించుకొన్నాడు. అతడు జీవితాంతం తండ్రి చిత్త ప్రకారం జీవించాడు. కడన మరణం తన్ను కబళించడానికి వచ్చినపుడు కూడ ఏమిూ జంకకుండా తండి విూదనే భారం వేసి అతనికి తన అసువులను అర్పించాడు. కుమారుని విధేయాత్మకమైన మరణం తండ్రికి ప్రీతి కలిగించింది.

క్రీస్తు మొదటి వేదసాక్షి తండ్రి తన కొప్పజెప్పిన కార్యాన్ని నెరవేర్చడానికి ప్రాణాలు కూడ అర్పించిన పుణ్యశీలుడు. ఈ వేదసాక్షిని అనుసరించి తర్వాత చాలమంది వేదసాక్షులు తమ ప్రాణాలను దేవునికి అర్చిస్తారు. సైఫను లాగే "యేసుప్రభూ! నా యాత్మను స్వీకరించు" అంటూ ఊపిరి విడుస్తారు - అచ 7,59, క్రీస్తు మరణం నేడు మన మరణానికి ఆదర్శంగా ఉంటుంది. ఈ లోకంలో దేవుడు మనకు ఒప్పజెప్పిన పనిని ముగించి కట్టకడన మన ప్రాణాలను ఆ ప్రభువు చేతిలోనికి అర్పించాలి, మన జీవితంలాగే మన మరణం కూడ ఆదర్శప్రాయంగా ఉండాలి. అది మనం చేపట్టిన ఆధ్యాత్మిక విలువలకు లోకం ఎదుట సాక్ష్యం పలికేలా ఉండాలి.

క్రీస్తు చనిపోయినపుడు ప్రకృతి శక్తులు కంపించాయి. ఆ సమయంలో ఐదు అద్భుత సంఘటనలు జరిగాయి. 1. దేవాలయం తెర నిలువన చినగడం 2. భూమి కంపించడం 8. కొండ బండలు బ్రద్దలు కావడం 4. సమాధులు తెరుచుకోవడం 5. మృతులు ఉత్తానం కావడం అనేవి - 27,51-53.

ఇవన్నీ దేవుడు కలిగించిన ఉత్పాతాలే. అతడు వాటికి కర్త. ఈ గుర్తులన్నీ తండ్రి క్రీస్తు ఆత్మార్పణాన్ని అంగీకరించాడనడానికీ, అతన్ని నీతిమంతునిగా ప్రకటించా