పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/133

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సొలోమోను జ్ఞానగ్రంథం రెండవ అధ్యాయం కూడ దుషులు నీతిమంతుని ఎగతాళి చేయడాన్ని గూర్చి చెప్తుంది. ఈ ఘట్టం పైన మనం పేర్కొన్న 22కీర్తన వాక్యానికి విపులీకరణం మాత్రమే. ఈ సందర్భంలోని వాక్యాలు ఇవి —

"తాను భగవంతుని 

అనుభవమునకు తెచ్చుకొనెననియు,
తాను దేవుని బిడ్డడననియు
నీతిమంతుడు చెప్పకొనుచున్నాడు
అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతము
అతని మరణము ఏ తీరుననుండునో చూతము
నీతిమంతుడు దేవుని కుమారుడగునేని
దేవుడు అతని కోపు తీసికొనును
శత్రువులు బారినుండి అతనిని కాపాడును
కనుక అతనిని క్రూరముగా హింసించి
పరీక్షకు గురిచేయుదము
అతని శాంతభావము ఏపాటిదో,
సహనభావము ఎంతగొప్పదో, పరీక్షింతము
అతనిని నీచమైన చావునకు గురిచేయదము
దేవుడే తన్ను రక్షించునని
అతడు చెప్పకొనుచున్నాడు కదా!" - 2,17-20.

కనుక ఈ సందర్భంలో మత్తయి 22వ కీర్తన నుండీ, సొలోమోను జ్ఞానగ్రంథం నుండీ కూడ తన వాక్యాలను ఉదహరించి వుండవచ్చు. క్రీస్తుని పరియాచకం చేసినవారిలో మూడవవర్గం వాళ్లు ఇరువైపులవున్న దొంగల.


దారిన పోయేవాళ్ళూ ప్రధానార్చకులూ సైనికులూ సిలువ విూద వ్రేలాడే క్రీస్తుని దూషించారు. అటుతర్వాత ఈ యిద్దరు దొంగల వృత్తాంతం వస్తుంది. దీన్ని లూకా సువిశేషం సవిస్తరంగా వర్ణిస్తుంది - 23,39–42. చెడ్డదొంగ క్రీస్తు విరోధుల్లాగానే ఆ ప్రభువుని దూషించాడు. కాని మంచిదొంగ ఆ తోడిదొంగను చీవాట్లు పెట్టాడు. నీ తప్పకు తగిన శిక్ష అనుభవిస్తున్నా కూడ నీకు బుద్ధిరాలేదని మందలించాడు.

అతడు తన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు. తమకు ప్రాప్తించిన శిక్షను అంగీకరించాడు. ప్రభువుని భక్తితో యేసూ! అని సంబోధించాడు. ఆ దివ్యనామం