పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు తాను దేవుని కుమారుద్ధాని చెప్పకొన్నాడని శత్రువులు అతని విూద నేరం తెచ్చారు. ఆ నేరాన్ని పరస్కరించుకొని ఇప్పడు దారివెంట పోయేవాళ్లు అతని మల్లా వేళాకోళం చేసారు. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మిూది నుండి దిగిరా చూద్దాం అన్నారు - 27,40. పూర్వం ఎడారిలో తపస్సు చేసికొనే క్రీస్తుని పిశాచం "నీవు దేవుని కుమారుడవైతే ఈ శిఖరం విూది నుండి క్రిందికి దూకు చూద్దాం అంది - 6,4. నీవు నీ తండ్రి చిత్తాన్ని పాటించవద్దు అని ప్రలోభపెట్టింది. ఇప్పడు ఈ ప్రజలు కూడ పిశాచంతో చేతులు కలిపారు. అంతా ప్రభువుని సిలువమిూది నుండి దిగిరమ్మనేవాళ్ల. సిలువమరణం నీకు వద్దు అని సలహా యిచ్చేవాళ్లే కాని తాను సిలువపై మరణించందే మనకు రక్షణం లేదని ప్రభువుకి బాగా తెలుసు. కనుక అతడు తండ్రి చిత్తానికి లొంగి ఆ సిలువకు ఇంకా గట్టిగా అంటిపెట్టుకొని వుండిపోయాడు.

దారివెంట బోయేవాళ్ళ వేళాకోళం ముగిసిన పిదప యూదుల మహాసభ సభ్యులైన ప్రధానార్చకులు, ధర్మశాస్త్రబోధకులు పెద్దలు అతన్ని గేలిచేసారు. వీళ్ల క్రీస్తుకి ప్రబల శత్రువులు. "వీడు ఇతరులను రక్షించాడు గాని తన్ను తాను రక్షించుకోలేక పోయాడు" అన్నారు – 27,42. కాని ప్రభువు తన్ను తాను రక్షించుకొంటాడు, మనలను రక్షిస్తాడు. ఏలా? సిలువ విూది నుండి దిగిరావడం ద్వారా కాదు, దానిపై చనిపోవడం ద్వారానే.

వాళ్లు అతన్ని ఇంకా దెప్పి పొడిచారు. నీవు యిప్రాయేలుకి రాజువికదా, మెస్సీయావికదా, సర్వశక్తిమంతుడివి కదా, ఐతే సిలువ విూది నుండి దిగిరా మేము నిన్నునమ్ముతాం అన్నారు. ఓ అద్భుతం చేసి సిలువ మిూదినుండి దిగు అని ఎత్తిపొడిచారు. కాని క్రీస్తు ఇక్కడ ఏ యద్భుతం చేయడు. అతని సిలువ మరణమూ అటుపిమ్మట వచ్చే ఉత్తానమూ అన్నిటికంటె గొప్ప అద్భుతాలు ఔతాయి. కాని అతని శత్రువులు ఈ అద్భుతాలనను గ్రహించలేరు.

విరోధులు అతన్ని ఇంకా హేళనం చేసారు. ఇతడు దేవుణ్ణి నమ్మాడు. దేవుని కుమారుణ్ణని చెప్పకొన్నాడు. కనుక ఆ దేవుట్టే వచ్చి ఇతన్ని రక్షించమనండి చూద్దాం అన్నారు – 27,43. కీర్తన 22,8లో విరోధులు నీతిమంతుణ్ణి అచ్చంగా ఈ వాక్యాలతోనే ఎగతాళి చేసారు. ఆ వాక్యాలు క్రీస్తుపట్ల పూర్తిగా నెరవేరాయి.

"ఇతడు ప్రభువుని నమ్మాడు
అతడు ఇతన్ని రక్షిస్తాడేమో చూద్దాం
ఇతడు ప్రభువుకి ఇష్టుడైతే
అతడు ఇతన్ని కాపాడతాడేమో చూద్దాం."