పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఐతే పేత్రు గొప్పతనమేమిటి? యూదా తక్కువతనమేమిటి? సువిశేషాల్లో పేత్రు పేరు అపోస్తలుల జాబితాలో మొదట రావడమెందుకు, యూదా పేరు అసలు ఆ జాబితాలోకి ఎక్కడ పోవడమెందుకు? పేత్రు దేవుణ్ణి తలంచుకొని దేవుని ముందట పశ్చాత్తాపపడ్డాడు. కనుక పాపపరిహారాన్ని పొందాడు, యూదా తన తప్పని తలంచుకొని తనలో తానే చింతించాడు, దేవుని యెదుట పశ్చాత్తాపపడనే లేదు. కనుక పాపపరిహారాన్ని పొందనే లేదు. అతడు చేసిందల్లా తన తప్పని తలంచుకొని చింతించడం. ఇక ఇప్పడేమిూ చేయలేంగదా అని బాధపడ్డం, నిరాశ చెందడం. నరకంలోని పిశాచాలు కూడ తమ తప్పనకు చింతిస్తాయి. కాని అవి దేవుని యెదుట పశ్చాత్తాపపడవు.

యూదా నేను నిరపరాధి రకాన్ని అప్పగించాను అన్నాడేకాని ఆ రక్తం తన పాపమాలిన్యాన్ని కడిగివేయాలని కోరుకోలేదు. అతడు ఎంతసేపటికి తనవైపు తాను చూచి దిగులుపడ్డాడే గాని దేవునివైపు జూచి పశ్చాత్తాపపడలేదు. పేత్రు ప్రభువుని తలంచుకొని వెక్కి వెక్కి యేడ్చి తనకు రక్షణాన్ని దయచేయమని వేడుకొన్నాడు. యూదా చెట్టు కొమ్మకు ఉరివేసికొనేపుడు గూడ తనకు ఎదురుగా కొండపై నిల్చివున్న సిలువవైపు చూడలేదు.

మన దిగులు, మన చింత, మన నిరాశ మనకు పాప పరిహారాన్ని సంపాదించిపెట్టవు. దేవుణ్ణి నమ్మి అతని యెదుట మన పాపానికి దుఃఖపడితే దోషవిముక్తి కలుగుతుంది. ఎప్పడు కూడా పపాపరిహారం దేవుని నుండి కాని నరుని నుండి కాదు. పేత్రు లాగే యూదా కూడ అపోస్తలుల జాబితాలో కెక్కి "పునీత యూదా? అని పిలువబడేవాడే. కాని అతడు చేతులారా ఆ యవకాశాన్ని జారవిడచుకొన్నాడు.

5. పిలాతు తీర్పు - 27, 11-31

క్రీస్తు పిలాతు ముందు నిల్చున్నాడు. పిలాతు అతనికి తీర్పు చెప్తున్నాడు. ప్రధానార్చకులు, యూద ప్రజలు క్రీస్తుకి మరణశిక్ష విధించమని పిలాతుని వత్తిడి చేసారు. దానికి లొంగి అతడు క్రీస్తుని సిలువ మరణానికి అప్పగించాడు. ఈ భాగంలో మూడంశాలున్నాయి, 1) పిలాతు క్రీస్తుని ప్రశ్నించడం 27, 11-14, 2) యేసు-బరబ్బ 27,15-26, 3) సైనికులు క్రీస్తుని పరిహసించడం 27,27-31.

1. పిలాతు క్రీస్తుని ప్రశ్నించడం - 27, 11-14

న్యాయసభవాళ్లు క్రీస్తుని రాష్ట్ర పాలకుడైన పిలాతు దగ్గరికి తోసికొని వచ్చారు. అతనిచే క్రీస్తుకి మరణశిక్ష వేయించాలని వాళ్ళ తలంప, పిలాతు ప్రభువుకి తీర్పు చెప్పడానికి