పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు దేవుని కుమారుడు మాత్రమేకాదు, మనుష్య కుమారుడు కూడ. బైబుల్లో మనుష్యకుమారుడు అంటే నరజాతికి చెందినవాడు, నరుడు అని భావం. ఇక్కడ ఈ బిరుదం క్రీస్తు నరుడుగా జన్మించడం వల్ల పొందిన అవమానాన్నీ తర్వాత ఉత్తానం కావడం వల్ల పొందిన మహిమనూ కూడ సూచిస్తుంది.

తండ్రి క్రీస్తుని ఉత్థానం చేసాడు. అతన్ని మహిమ పరచి తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకొన్నాడు. ఇక మిూదట తండ్రితో పాటు క్రీస్తు కూడ రాజ్యపాలనం చేస్తాడు. అతడు తండి యంతటివాడు. ఈ సందర్భంలో కీర్తన కూడ ఈలా చెప్పంది :

ప్రభువు నా ప్రభువుతో ఈలా అన్నాడు
నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసేంతవరకు
నీవు నా కుడిప్రక్కన ఆసీనుడివికా - 110,1.

ఈ ప్రవచనం ఉత్థాన క్రీస్తుకి అన్వయిస్తుంది.

ప్రభువు మేఘారూఢుడై ఆకాశం నుండి దిగివస్తాడు అనే భావం దానియేలు 7, 13 నుండి గ్రహింపబడింది. ఇక్కడ ప్రభువు మేఘారూఢుడై వచ్చేది కడపటి దినాన నరులందరికీ తీర్పు తీర్చడానికి కనుక ఈ వాక్యం అతడు రెండవసారి న్యాయాధిపతిగా వేంచేస్తాడని తెలియజేస్తుంది. క్రీస్తుతండ్రికుడిపార్యాన ఆసీనుడు కావడం, న్యాయాధిపతిగా రావడం అనే రెండు కార్యాలు అతని ఉత్థానం నుండి ప్రారంభమౌతాయి. కనుకనే క్రీస్తు ఇక్కడ “ఇక నుండి" అనే మాట వాడాడు - 26,64.

క్రీస్తు ఈ రెండంశాలను న్యాయసభకు తెలియజేసినట్లుగా సువిశేషంలో వున్నా మత్తయి ఈ విషయాలను ప్రధానంగా తొలినాటి క్రైస్తవ సమాజానికి తెలియజేసాడు అనుకోవాలి. అతని సువార్త ప్రచారంలోకి వచ్చినపుడు ఆదిమ క్రైస్తవ సమాజం ఈ సత్యాలను భక్తితో మననం జేసికొంది,

క్రీస్తు ఈ అంశాలను చెప్పగానే ప్రధానార్చకుడు బట్టలు చించుకొన్నాడు. క్రీస్తు తన్నుదేవునితో సమానం చేసికొన్నాడు, కనుక అతడు దేవదూషణలు పలికాడని అరిచాడు. యూదులు దేవదూషణలు విన్నపుడూ సంతాపాన్ని తెలియజేసేపుడూ ಬಟ್ಟಿಲು చించుకునేవాళ్లు, కయిఫాకు వంతపాటపాడే న్యాయసభ సభ్యులంతా యేసు మరణశిక్షకు పాత్రుడని పల్మారు - 26,66. ఐనా న్యాయసభ ఇక్కడ క్రీస్తుని చంపించాలని నిర్ణయించలేదు. ఆ కార్యం శుక్రవారం వేకువజామున జరుగుతుంది – 27,1.

ఈ విచారణం జరిగాక న్యాయసభ సభ్యులే క్రీస్తుని అవమానించారు. వాళ్ళ అతని ముఖం విూద ఉమిసి అతన్ని పిడికిళ్ళతో పొడిచారు. అతని ముఖానికి గంతకట్టి