పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు మౌనానికి కయిఫా విస్తుపోయాడు. అతడు సజీవుడైన దేవుని విూద ఒట్టపెట్టుకొని అడుగుతున్నాను. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా అని ప్రశ్నించాడు -26,63. క్రీస్తు ఏ పరిస్థితుల్లోను ఒట్ట వేయవద్దన్నాడు - 5,37. కయిఫా ఆరంభంలోనే ఈ నియమాన్ని విూరాడు. ఇంతకు ముందు పేత్రు నీవు సజీవుడైన దేవుని కుమారుడివి అని క్రీస్తుతో చెప్పాడు – 16.16. కాని పేత్రుకున్న విశ్వాసం కయిఫాకు లేదు. కనుకనే అతడు క్రీస్తుని పైరీతిగా ప్రశ్నించాడు.

ఇక్కడ కయిఫా దేవుని కుమారుడు, క్రీస్తు అనే రెండు మాటలు వాడాడు. మొదట దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటి? యూదుల భావాల ప్రకారం వారి రాజు దేవుని కుమారుడు. కనుకనే కీర్తన 2,7లో యావే ప్రభువు ఆనాటి రాజు నుద్దేశించి "నీవు నా కుమారుడవు. ఈనాడు నీవు నాకు జన్మించావు" అంటాడు. ఇంకా, ప్రభువు కొరకు బాధలు అనుభవించి ఆ శ్రమల్లోను భక్తిని కోల్పోనివాడు కూడ దేవుని కుమారుడే సోలోమోను జ్ఞాన గ్రంథం ఈలా చెప్తుంది :

నీతిమంతుడు దేవుని కుమారుడేని
దేవుడు అతని కోపతీసికొంటాడు
శత్రువుల బారినుండి అతన్ని కాపాడతాడు - 2,18

ఇక, ఇక్కడ క్రీస్తు దేవుని కుమారుడు అనడంలో మత్తయి భావం ఇది. క్రీస్తు దేవునికి సన్నిహితుడు, దేవుని శక్తిని పొందినవాడు. మృత్యువుని జయించి ఉత్తానుడైన వాడు. దేవుని ఆజ్ఞలకు విధేయుడయిన నిజమైన యిప్రాయేలు. యిస్రాయేలు ప్రజల కోరికలూ ఆశలూ తీర్చేవాడు అతడే అతడు నిజంగా దేవుని కుమారుడు, దేవుడంతటివాడు.

ఈ దేవుని కుమారుడు క్రీస్తు కూడ. క్రీస్తంటే మెస్సీయా, దేవుని ప్రతినిధిగా వచ్చి యిస్రాయేలీయులను కాపాడేవాడు.

కయిఫా ప్రశ్నకు క్రీస్తు నేరుగా జవాబీయకుండా నీవన్నట్లే అని బదులు చెప్పాడు. ఇది ఓ రకమైన అరమాయిక్ ప్రయోగం. ఇక్కడ కయిఫా తన ప్రశ్న ద్వారానే క్రీస్తు దేవుని కుమారుడని సూచించాడు అనుకోవాలి. ఆ ప్రశ్నలోనే అతడు తెలిసికోగోరిన జవాబు ఇమిడి ఉంది అనుకోవాలి. ఈ ప్రయోగాన్ని పూర్వమే వివరించాం. (చూడు 26, 25 విూద వివరణం),

క్రీస్తు ఈ సందర్భంలో తన్ను గూర్చి ఇక్కడ రెండు నూత్నాంశాలు చెప్పకొన్నాడు. 1. ఇకనుండి మనుష్య కుమారుడైన తాను సర్వశక్తిమంతుని కుడిప్రక్కన కూర్చుండి వుంటాడు. 2. తాను ఆకాశము నుండి మేఘారూఢుడై దిగివస్తాడు - 26,64 ఈ రెండంశాలను కొంచెం విపులంగా పరిశీలిద్దాం.