పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

1. మనుష్యావతారం

నరుడ్డి దేవుణ్ణి చేయడానికి దేవుడు నరుడై పట్టాడు అన్నారు పూర్వవేదశాస్తులు. ಇದೆ మనుష్యావతారం. ఈ యధ్యాయంలో ఆరంశాలు పరిశీలిద్దాం.

1. పిత వాగ్దానం, యూదుల నిరీక్షణం

పరలోకంలోని తండ్రి మెస్సియాను పంపుతానని ముందుగనే వాగ్హానం చేసాడు, యూదభక్తులు ఈ మెస్సియా కోసం గంపెడాశతో ఎదురుచూస్తూ వచ్చారు.

ఆదాము దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపం చేసిన పిదప ప్రభువు పిశాచంతో "నేను నీకూ స్త్రీకీ, నీ సంతతికీ ఆమె సంతతికీ తీరనివైరం కలిగిస్తాను. ఆమె సంతతివారు నీతల నలగడ్రోక్కుతారు. నీవు మాత్రం వాళ్ళ మడమలు కరుస్తావు" అన్నాడు - ఆది 8, 15. ఈ ప్రవచనంలో పిశాచం తలను నలగడ్రోక్కే s సంతానం మెస్సీయా, బైబుల్లో మెస్సీయాను గూర్చిన మొదటి ప్రవచనం ఇదే. అటుపిమ్మట ప్రభువు అబ్రాహాముతో "నీ సంతానంద్వారా సకల జాతులు దీవెనలు పొందుతారు" అని చెప్పాడు - ఆది 22,18, అబ్రాహాము సంతానంలో ముఖ్యుడైనవాడు మెస్సీయా, అతని ద్వారానే అన్ని జాతులు రక్షణం పొందాలి. ఆ తరువాత ప్రవక్తలకాలంలో యెషయా మెస్సీయా పట్టువును వర్ణిస్తూ “అతడు ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలవంతుడైన దేవుడు, శాశ్వతుడైన పిత, శాంతికరుడైన అధిపతి" అని పేరు పొందుతాడని చెప్పాడు - 9,6. ఇదే ప్రవక్త ఆ మెస్సీయా అనుభవించే బాధలనుగూడా వర్ణిస్తూ "మన పాపాలకోసం అతన్ని వధించారు. చంపడానికి తోలుకొనిపోయే గొర్రెపిల్లలాగ, ఉన్ని కత్తిరించడానికి కొనిపోయే గొర్రెలాగ అతడు మౌనంగా వుండిపోయాడు" అని నుడివాడు – 537 ఈలాంటి ప్రవచనాలు పూర్వవేదంలో ఇంకా చాలవున్నాయి. ఇవన్నీ దేవుడు మెస్సీయాను పంపుతానని చేసిన వాగ్లానాలు,

యూదభక్తులు ఈ మెస్సీయా కోసం గంపెడాశతో ఎదురుచూచారు. "ప్రభో! ఆ రానున్నవాణ్ణి పంపు" అని ప్రార్థించారు. ఇంకా

"ఆకాశం మంచును కురియించాలి
మబ్బులు నీతిమంతుని వర్షించాలి
భూమి రక్షకుని మొలకెత్తించాలి"
అని మనవిచేసారు - యొష 45,8.