పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకదాన్ని ఉదహరించాడు. అది ఇది "శోధనకు గురికానివా డెవడూ దైవరాజ్యంలోకి ప్రవేశించలేడు". క్రీస్తకిగెత్సెమని ఒక శోధనలాంటిది. అతడు దైవచిత్తానికి లొంగుతాడో లేదో ఆ శోధన పరీక్షించింది. అక్కడ క్రీస్తు తండ్రీ! నీ చిత్త ప్రకారమే కానీయి అని పల్కి ఆ శోధనను జయించాడు. క్రీస్తుకు లాగే ఈనాడు మన గెత్సెమని మనకుంటుంది. మన శోధనలే మన గెత్పెమని అనుకోవాలి. కాని వాటి నుండి మనం గట్టెక్కగలమా?

2. క్రీస్తుగెత్సెమని తోపులో శిష్యులతో వున్నావంటరివాడయ్యాడు. వాళ్ళ వల్ల అతనికి ఏ సహాయమూ లభించలేదు. మనం కూడ మన బాధల్లో చాలసార్లు వంటరి వాళ్లమైపోతాం. మనచుటూ వున్నవాళ్లు కూడ మనకు సాయం చేయలేరు. అలాంటి పరిస్థితిలో మన వంటరితనపు బాధను తొలగించమని ప్రభువునే అడుగుకోవాలి. ఆనాడు ఓలివు తోటలో వంటరితనాన్ని అనుభవించిన ప్రభువు మన బాధను అర్థం జేసికొంటాడు.

3. మూడవసారి ప్రార్థన చేసి ముగించాక క్రీస్తు శిష్యుల దగ్గరికి వచ్చి "ఇక లేవండి, పోదాం. నన్ను పట్టియిచ్చేవాడు సమిపంలోనే వున్నాడు" అన్నాడు - 24,46. సెల్సస్ అనే రెండవ శతాబ్దపు రోమను పౌరుడు క్రైస్తవులకు బద్ధ శత్రువు. అతడు “ఇక లేవండి, పోదాం" అన్నపై క్రీస్తు మాటలను ఉదాహరించి, ఇక్కడ క్రీస్తు శత్రువుల నుండి పారిపోగోరాడు అని వాదించాడు, కాని ఇక్కడ "లేవండి, పోదాం" అంటే యూదాతో వచ్చే శత్రువర్గం నుండి పారిపోదామని భావం కాదు. ఆ శత్రువర్గాన్ని ఎదుర్కోడానికి వెళ్లాం పదండి అని భావం. క్రీస్తు యూదా నుండి పారిపోలేదు, అతనికి ఎదురు వెళ్లాడు. కాని ఈ శక్తి అతనికి ఏలా వచ్చింది? తాను మూడుసార్లు ప్రార్ధనం చేసికోవడం వల్లనే. నేడు మనం కూడ ప్రార్థన ద్వారానే శక్తిని పొందాలి. ఆ శక్తితోనే ఈ లోకంలో మన కెదురయ్యే బాధలనూ సమస్యలనూ ఎదుర్కోవాలి. కనుక ప్రార్థన చేసికోనివాడు ఈ లోకంలో ఎదురయ్యే పోరాటాల్లో నిలువలేడు.

4. శిష్యుల బాధ్యత క్రీస్తు మరణ సమయంలో అతనికి అండగా నిల్వడం. అతడు తండ్రి నిర్ణయించిన సిలువ మరణాన్ని అనుభవించేలా చూడ్డం. కాని వాళ్లు ఈ బాధ్యతను విస్మరించి నిద్రపోయారు. కనుక శోధనకు గురయ్యారు. శత్రువులకు భయపడి క్రీస్తుని విడనాడి పారిపోయారు. ఈనాడు మనం కూడ ఆ శిష్యుల్లాగే మన బాధ్యతలను విస్మరిస్తాం. మనం చేయవలసిన కార్యాలను వదలివేసి ఏవేవో పిచ్చిపిచ్చి పనుల్లో పడిపోతాం. కాలుజారి పాపంలో పడిపోతాం. క్రీస్తు చెప్పినట్లుగా, శోధనలకు గురికాకుండా వుండాలంటే, జాగ్రత్తగా మేల్కొనివుండి ప్రార్ధనం చేసికోవాలి. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించాలి.