పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెట్టుకు వ్రేలాడదీసేవాళ్ళు. ఇది కూడ ఒక రకమైన సిలువ మరణమే, అవమానాన్ని సూచించేదే - ద్వితీ 21, 22 - 23. కాని అరుదుగా యూదులు కూడ సిలువ మరణాన్ని అమలు చేయించారు.

2. క్రీస్తు సిలువ మరణం

సువిశేషాలు వర్ణించే క్రీస్తు సిలువ మరణం అచ్చంగా ఆనాటి రోమనుల సిలువ శిక్షా పద్ధతిలోనే జరిగిపోయింది. ఇక్కడ కొన్ని వివరాలను పరిశీలిద్దాం. సిలువ శిక్షకు ముందు అతన్ని కొరడాలతో కొట్టించారు - మార్కు 15,15. అతడు తన అడ్డమానును తానే మోసికొని కపాల కొండకు వెళ్ళాడు - యోహా 19, 17. దోషులు దిగంబరులుగానే సిలువను మోయాలి. కాని యూదులు మాత్రం తమ దేశంలో సిలువవేయబడేవాళ్ళు సవస్తులుగానే ఆ శిక్షను అనుభవించే అనుమతిని పొందారు. కనుక ప్రభువుని కొరడాలతో కొట్టాక మళ్ళా అతని దుస్తులు అతనికి కట్టబెట్టారు - మార్కు 15, 20. ఒక దోషి సిలువ మరణం దోషులందరికీ హెచ్చరికగా వుండాలని రోమను ప్రభుత్వం ఉద్దేశం. కాని దోప్ని దారిలోనే చనిపోతే ఈయాశయం నెరవేరదు. క్రీస్తు కూడ బలహీనుడై సిలువను మోయలేని పరిస్థితిలో వున్నాడు. కనుక అతడు దారిలోనే చనిపోకుండా వుండడానికి అతని సిలువను కొంతదూరం మరొకనిచో మోయించారు. అతడే కురేనియా సీమోను - 15,27. క్రీస్తు శారీరక బాధను తగ్గించడానికి అతనికి మత్తుపానీయాన్ని ఈయబోయారు. ఇది కూడ యూదులు రోమను ప్రభుత్వంనుండి ప్రత్యేకంగా పొందిన అనుమతి. ఇది కరుణకార్యం. కాని ప్రభువు ఆ పానీయాన్ని స్వీకరించలేదు. నరుల కొరకు పూర్తి శ్రమలను అనుభవించాలనే అతని కోరిక - 15,23. కడన క్రీస్తు వస్తాలను తొలగించారు - 15, 25. చీలలతో అతని చేతులను అడ్డమానుకి అంటగొట్టారు. చివరన అతన్ని సిలువపై కొరతవేసారు. అతడు సిలువపై దిగంబరుడుగానే చనిపోయాడు.

యేసు సిలువపై “యూదులరాజు" అనే నేరం వ్రాసిపెట్టారు - 15,26. దాన్ని హీబ్రూ, గ్రీకు, లాటిను అనే మూడు భాషల్లోను వ్రాసారు. అతన్నిచాల యెత్తు మానుమీద కొరత వేసారు. అందరూ అతన్నిచూచి చీదరించుకోవాలని యూదుల అభిలాష. అతనికి పులిసిన రసాన్ని ఈయబోయినపుడు దాన్ని ఒక కర్రకు తగిలించి పైకెత్తి ఈయవలసి వచ్చింది - 15,36. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం కొరత వేయబడినవాని శవం రేయి చెట్టుప్తె ఉండకూడదు. అది దేశాన్ని అపవిత్రం చేస్తుంది - ద్వితీ 21,23.యూదులు ఈ సంగతి రోమను అధికారులకు విన్నవింపగా వాళ్లు క్రీస్తు కాళ్ళను విరుగగొట్టి అతనికి త్వరలో చావు రప్పించడానికి సైనికులను పంపారు. కాని ఆ సైనికులు వచ్చిచూడగా