పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలోనే హెరోడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడు ఈ శిక్షను పేర్కొన్నాడు. పర్యారాజులు ఈ శిక్షను ఎక్కువగా అమలు చేయించారు. అక్కడినుండి ఇది ఆఫ్రికా దేశంలోని కార్తేజికి ప్రాకింది. అక్కడినుండి గ్రీసురోమను దేశాల్లోకి దిగుమతి ఐంది. అలెగ్జాండరు చాలమందికి సిలువ శిక్ష విధించాడు. రోమను ప్రభువులు లక్షలకొలది ద్రోహులను నిర్ణయతో సిలువ వేసారు. రోమనుల దృష్టిలో సిలువచావు క్రూరమైన బాధకీ అవమానానికీ గూడ నిలయమైంది. కావున బానిసలనేగాని రోమను పౌరుల నెవరినీ సిలువ వేయకూడదని కట్టడచేసారు. మామూలుగా రోమను ప్రభుత్వం రాజకీయ ద్రోహులూ, తిరుగుబాటుదారులూ, దొంగలూ మొదలైన నేరగాళ్ళను సిలువవేసేది.

రోమనులు సిలువ శిక్ష విధించాక దోషిని న్యాయస్థానంలోనే కొరడాలతో కొట్టించేవాళ్ళు. ఇది కూడ కఠినమైన శిక్ష అసలు ఈ శిక్షవల్లనే ఆ దౌర్భాగ్యుడికి సగం ప్రాణాలు పోయేవి. ఆ పిమ్మట దోషి చేతులను అడ్డమానుకి అంటగట్టేవాళ్ళు అతడే అడ్డమానును భుజాలపై కొరత స్థలానికి మోసికొని పోవాలి. అక్కడ అతన్ని అడ్డమానుతో సహ లేపి చీలలతో నిలువుమానుపై అంటగొట్టే వాళ్ళ దారిపోడుగున సైనికులు అతన్ని అవమానిస్తు హేళన చేసేవాళ్ళ కడన అతడు సిలువపై ఫరోరయాతనలు అనుభవించి చనిపోయేవాడు. ఎవరూ అతనిపట్ల దయా సానుభూతి చూపేవాళ్ళు కాదు. సిలువ పై భాగాన దోషి పేరూ అతడు చేసిన నేరమూ వ్రాసివుంచేవాళ్ళ దోషి త్వరగా చనిపోకపోతే అతని కాళ్ళ విరుగగొట్టేవాళ్ళు అప్పడు నిందితుడు క్రిందికి వేలాడుతూ ఊపిరాడక ప్రాణాలు విడిచేవాడు. ఇంకా కొన్నిసార్లు నిందితుని రొమ్మును ప్రక్కభాగాన ఈటెతో పొడిచేవాళ్ళ ఆ పోటు గుండెకు తగిలి అతడు వెంటనే మరణించేవాడు. మరణం తర్వాత దోషి దేహం సిలువపైనే వుండి కుళ్ళిపోయేది. కొన్నిసార్లు క్రూరమృగాలు కూడ దానిని లాగుకొని తినేవి. అతనికి భూస్థాపనం వుండేది కాదు. ప్రజలు దోషి దుర్గతిని చూచి భయపడి నేరాలకు దూరంగా వుండాలని అధికారుల తలపు.

సిలువ మరణం బహుక్రూరమైంది. దాని బాధను భరించలేక దోషి అందరినీ దూషించి శపించేవాడు. తన్నుకన్న తల్లిదండ్రులను కూడ శపించేవాడు. తాను పట్టకుండా వున్నా బాగుండేదని వాపోయేవాడు. ఇంకా అతడు తన చెంతకు వచ్చినవారిపై కోపంతో ఉమ్మి వేసేవాడు. అందుకే సైనికులు కొన్నిసార్లు అతని నాలుకను కోసివేసేవాళ్ళ మామూలుగా దోషులను అందరికీ కనిపించే బహిరంగ స్థలాల్లోనే సిలువ వేసేవాళ్ళు వారి చావును కన్నులార చూచినవాళ్ళు నేరాలు చేయడానికి జంకేవాళ్ళు.

పాలస్తీనా దేశంలో యూదులు సిలువ మరణాన్ని అమలు పరచలేదు. ద్రోహిని రాళ్ళతో కొట్టిచంపడం వాళ్ళ పద్ధతి. వాళ్ళు కొన్నిసార్లు దోషిని వధించి అతని శవాన్ని