పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. భగవంతునికి ఐదు ఉపమానాలు

బైబులు భాష్యం - 9

మనవి మాట

యావే మోషే ముఖాన సీనాయి చెంత యూదులతో ఒడంబడిక చేసికొన్నాడు ఈ యొడంబడిక ప్రకారం అతడు వాళ్ల దేవుడయ్యాడు. వాళ్ళు అతని ప్రజలయ్యారు. అతనికీ వాళ్లకూ గాఢ సంబంధం ఏర్పడింది. కనుక ఒడంబడిక పూర్వవేదానికి పునాది. ఈ యొడంబడిక వలన భగవంతునికీ ప్రజలకూ ఏర్పడిన గాఢసంబంధాన్ని కొన్ని ఉపమానాలతో వర్ణించారు పూర్వవేద రచయితలు. 1) ఆ దేవుడు కాపరిలాంటివాడు. ఆ ప్రజలు గొట్టెల మందలాంటివాళ్లు, 2) అతడు వరుని లాంటివాడు. ఆ ప్రజలు వధువు లాంటివాళ్లు, 3) అతడు తోటమాలి లాంటివాడు, యిప్రాయేలు తోట లాంటివాళ్లు, 4. యావే తండ్రి లాంటివాడు, యిప్రాయేలు కుమారుని వంటివాడు. 5) యావేభవన నిర్మాత, యిస్రాయేలు అతడు నిర్మించిన భవనం. ఇక, పూర్వ వేదానికి పునాది సీనాయి నిబంధనమైతే, నూత్నవేదానికి పునాది సిలువ నిబంధనం. ఈ సిలువ నిబంధనం ద్వారా క్రీస్తుకూ నూత్న వేద ప్రజలకూ గాఢ సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధాన్ని సూచించడానికి నూత్న వేద రచయితలు కూడ పై పూర్వవేద ఉపమానాలనే ఎన్నుకున్నారు. కనుక పై ఐదుపమానాలు బైబులు భగవంతుణ్ణి వర్ణిస్తాయి. ఆ భగవంతునికి బైబులు వాడిన ఉపమానాలు ఇంకా కొన్ని వున్నాయి గాని, ఈ యైదు మాత్రం ప్రధానమైనవి. ప్రస్తుత సంచికలో ఈ యైదుపమానాలు చెప్పాం. వీని సహాయంతో బైబులు భగవంతుడు ఎలాంటివాడో వివరించి చూపాం. పాఠకులు ఈ యుపమానాలను చక్కగా చదివి భక్తితో మననం జేసికొనడం ద్వారా యిప్రాయేలు దేవుడైన యావేతో, క్రైస్తవుల దేవుడైన క్రీస్తుతో వ్యక్తిగతమైన అనుభవం పెంపొందించుకోవచ్చు.

1. కాపరి - మంద

1. యిస్రాయేలు ప్రజలకు భగవంతునికి వాడిన ఉపమానాలన్నింటిల్లోను "కాపరి" అనే ఉపమానం అతిప్రాచీనమైంది. కాపరి మందకు నాయకుడు, స్నేహితుడు. ఆతడు మందనుగూర్చి ఏలా జాగ్రత్త పడతాడో ప్రభువూ తన ప్రజలను గూర్చి ఆలా జాగ్రత్త పడతాడు. యిప్రాయేలు ప్రజకు సమీపజనులైన ఈజిప్టు, బాబిలోను ప్రజల్లోకూడ ఈ భావం బహుళ ప్రాచరంలో వుండేది. ఈదేశాల రాజులు కాపరులుగా భావింపబడేవాళ్లు, దేవతలే వీళ్లను ప్రజలమీద కాపరులుగా నియమించారు అనుకునేవాళ్లు, క్రీస్తుపూర్వము