పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలసి భోజనం చేసాత్రోసివేసాడు. విశ్రాంతి నియమాలను మీరి రోగులకు వ్యాధి నయంజేసాడు. వ్యభిచారిణిని రాళ్ళతో కొట్టి చంపాలనే ధర్మశాస్త్ర నియమాన్ని ఉల్లంఘించాడు. ఉపవాస నియమాలను పాటించలేదు. అట్టడుగు వర్గంవారితో డు - మత్త 9, 14. అతని కార్యాలు యూదుల సంప్రదాయాలమీద తిరుగుబాటు అన్నట్టుగా కన్పించేవి. అతని స్వతంత్రబుద్ధి ఆలాంటిది.

ప్రభువు ధనం ఆస్తిపాస్తులు కూడబెట్టుకోలేదు. అవి మన స్వేచ్ఛను హరిస్తాయని అతని భావం. అతడు సంచార బోధకుడు. సొంత ఇల్లకూడ లేకుండ బికారిలాగ ఊరినుండి ఊరికి తిరుగుతుండేవాడు- మత్త 8,20. తరచుగా ఇతరుల ఆతిథ్యంతోనే రోజులు గడిపేవాడు. అతడు పుట్టినపుడు సొంతయింటిలో పుట్టలేదు. చనిపోయినపుడు అతన్ని సొంతసమాధిలో పాతిపెట్టలేదు. మరణానంతరం సైనికులు అతని వస్తువులను పంచుకోబోగా పై అంగీమాత్రమే దొరికింది. ఇహలోక వస్తువులకు దాసుడుకాని స్వతంత్రుడు యేసు.

కడన, క్రీస్తు భయానికికూడ లొంగలేదు. అతడు భయపడిన సందర్భాలు లేకపోలేదు. మార్కు 14, 33-34. కాని అతడు దానికి లోపడలేదు. హెరోదు తన్ను చంపజూస్తున్నాడని తెలియవచ్చినా జంకలేదు. యూద నాయకులు తన్ను నాశంజేయ జూచినా దడియలేదు. ఈయంశాలన్నీ అతని స్వాతంత్ర్యానికి నిదర్శనం. ఇంత వరకు క్రీస్తు జీవితంలోని ముఖ్యాంశాలను నాల్గింటిని పరిశీలించాం. ఇక అతని బోధలను తిలకిద్దాం.

2. క్రీస్తు బోధలు

ప్రభువు జీవితశైలికీ అతని బోధలకూ దగ్గరి సంబంధం ఉంది. అతడు ఏలా జీవించాడో ఆలాగే బోధించాడు. క్రీస్తు బోధా జీవితమూ ఒకటే. తానాచరించంది ఏనాడూ చెప్పలేదు. ప్రస్తుతం అతని ఉపదేశాల్లో నాల్గు ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.

1. దేవునిపై ప్రేమ

క్రీస్తు భావాల ప్రకారం, దేవునికి మనపై అమిత ప్రేమ ఉంటుంది. మనం అతన్ని అడక్కముందే మనకు ఏంకావాలో అతనికి తెలుసు. ఆ తండ్రి మనలనుగూర్చి ఎంతగా జాగ్రత్తపడతాడంటే, మన తల వెండ్రుకల సంఖ్యకూడ అతనికి తెలుసు - మత్త 10,30. మనం అతన్ని నమ్మవచ్చు. మనం తప్పచేసినా అతనికి మనపట్ల ఉండే కరుణ పోదు. మనం పశ్చాత్తాపపడి మళ్ళా తనదగ్గరికి రావాలనే ఆ తండ్రి కోరిక. ఈలా మన