పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మళ్ళా జనం దగ్గరికి వెళ్ళి వారికి సేవలు చేసేవాడు. నిజానికి అతని ప్రార్ధన తన సేవలను బలపర్చుకోవడానికే. ఎడారిలో అతడు చేసిన నలువది నాళ్ళ ప్రార్థనకూడ తర్వాత బహిరంగ జీవితం ద్వారా తోడివారికి పరిచర్యలు చేయడానికి- లూకా 4,1-2. యేసు విశేషంగా అట్టడుగువర్గం వారితో కలసిపోయేవాడు. వారితో అన్న పానీయాలు సేవించేవాడు. అది గిట్టని విరోధులు "భోజన ప్రియుడు, మద్యపాన రతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని అతన్ని గేలిచేసారు - లూకా 7,34. అతడు స్నాపక యోహానులాగ తపస్సులు ఉపవాసాలు చేసి ప్రజల మొప్ప పొందినట్లుగా సువిశేషాలు యొక్కడా చెప్పవు. అతడు బ్రహ్మచర్య జీవితం గడిపినందుకు సమకాలికులు అతన్ని మెచ్చుకొన్నట్లు యొక్కడా వినం. అతడు ప్రజలకు చేసిన సేవలు మాత్రం నూత్నవేదం మాటిమాటికి పేర్కొంటుంది. క్రీస్తు ప్రధానంగా ప్రజల మనిషి అతనికి తండ్రిపట్ల అపారమైన ప్రేమ. ఆ తండ్రిని తోడివారిలో గుర్తించి వారికి సేవలు చేసేవాడు.

3. అతడు ప్రజలకు దైవసాన్నిధ్యం

మత్తయి సువార్త యేసుని యిమ్మానువేలు అనిపిలుస్తుంది. అనగా దేవుడు మనతో వున్నాడని భావం – 1,23. ఇక్కడ దేవుడు మనతో వున్నాడంటే, మనలను కాపాడుతూ సంరక్షిస్తూ వుంటాడని భావం. ఆనాటి ప్రజలు క్రీస్తు ద్వారా దేవుడు తమ్ము సందర్శించాడని యెంచారు. యోహాను సువిశేషం క్రీస్తుని దేవుని వాక్కు అంటుంది. - 1,1. ఇక్కడ వాక్కు అంటే సందేశం. దేవుడు ప్రజలకు తెలియజేసిన సమాచారం. పూర్వవేదప యూదులకు దేవుడు తమతో మాట్లాడతాడని తెలుసు. ప్రకృతి పారాలద్వారా, చారిత్రక సంఘటనల ద్వారా, ప్రవక్తల బోధల ద్వారా దేవుడు యిప్రాయేలీయులతో మాట్లాడాడు. ఈ మాటలే దేవుని సందేశం. ఇక క్రీస్తు దేవుని వాక్కు అంటే, దేవుడు యూదులకు చెప్పగోరిన సందేశమంతా క్రీస్తు అనే వ్యక్తిలో కేంద్రీకృతమై వుందని భావం. దేవుడు క్రీస్తు ద్వారా యిస్రాయేలీయులకు తన్నుతాను పూర్తిగా తెలియజేసికొన్నాడని అర్థం. కనుకనే ప్రభువు ఫిలిప్పుతో "నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని చెప్పాడు – యోహా 14,9. కావున క్రీస్తు ప్రజలకు దైవసాన్నిధ్యం.

ప్రభువు పాపులతోను, సుంకరులతోను కలసి భోజనం చేసేవాడు - మత్త 9,10–12. ఇది గొప్ప సంఘటనం. క్రీస్తు ద్వారా దేవుడే యూదుల్లో అట్టడుగు వర్గంవారితో కలసి భోంచేసినట్లు, దేవుడే వారిని అంగీకరించి వారి పాపాలు మన్నించి వారితో కలసిపోయినట్లు. యూదుల భావాల ప్రకారం, మనం ఎవరితో భుజిస్తామో వారితో సరిసమానమౌతాం. వారిలాంటి వాళ్ళమౌతాం. వారిలోకి మారిపోతాం. కనుక ఈ