పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని. పిలువవచ్చు. క్రీస్తు ఆరాధించిన దేవుడు కరుణామయుడు, ప్రేమపూరితుడు. మనం మన అమ్మానాన్నలనులాగే ప్రేమమయుడైన ఈ పరలోకపు నాన్నను గూడ నమ్మాలి. ఆ నాన్న మనలను అంగీకరించి ఆదరిస్తాడని విశ్వసించాలి.

క్రీస్తు తండ్రిని నమ్మి పూర్తిగా అతని కొరకే జీవించాడు. జీవితంలోని ప్రతి సంఘటనలోను ఆ తండ్రి హస్తాన్ని దర్శించాడు. ఇతరులకు కూడ ఆ తండ్రిని గూర్చి బోధించాడు. ఏకాంతంగా ఆ తండ్రి సమక్షంలో వుండిపోయి అతనికి ప్రార్ధనం చేసికొన్నాడు.

క్రీస్తు ధ్యేయం తండ్రి చిత్తాన్ని పాటించడమే. ఆ చిత్తాన్ని పాటించడం తనకు భోజనంతో సమానం అన్నాడు - యోహా 4,34. అతన్ని గూర్చిన దైవచిత్తం ఏమిటి? సిలువ మరణం. కనుక తండ్రి నిర్ణయించినట్లుగా సిలువపై చనిపోవడానికి అతడు తపించిపోయాడు. ఆ సిలువ మరణం నెరవేరేవరకు అతని హృదయానికి శాంతిలేదు - లూకా 12,50. ప్రభువుకి అన్నిటికంటె తండ్రి, అతని eg, అతని ప్రేమ ಮಿಫ್ಟಿಂ. అతనితో ఐక్యమై జీవించడం ప్రధానం. ఈ యంశాన్ని బాగా గ్రహిస్తేనేగాని మనం అతన్ని అర్థంచేసికోలేం.

2. అతడు ఇతరుల కొరకు జీవించాడు

సువిశేషాల్లో ఎక్కడ చూచినా క్రీస్తు ఎవరికో ఏవో సేవలు చేస్తున్నట్లుగా కన్పిస్తాడు. అతడు సేవలు చేసే వ్యక్తి ఒక్కడుకావచ్చు లేక ఓ సమూహం కావచ్చు. అతని పరిచర్యలు నానా విధాలుగా వుండేవి. ప్రజల పాపాలు పరిహరించడం, రోగాలు నయం చేయడం, ఆహారం పంచిపెట్టడం, దయ్యాలను పారద్రోలడం, దుఃఖితులను ఓదార్చడం ప్రోత్సహించడం, ప్రజల ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఈలా అతని పరిచర్యలు బహు విధాలుగా వుండేవి. కొన్నిసార్లు అతడు మతాధికారులతోను రాజకీయ నాయకులతోను తలపడేవాడు. కాని ఇదికూడ పీడితులకు మేలు చేయడానికే. లూతరెన్వేదశాస్త్రి బోన్హోపర్ అతనికి "ఇతరుల మనిషి" అని పేరు పెట్టాడు. ఇది అక్షరాల సత్యం. నరుల బాధలను తొలగించడమే అతని ప్రధానమైన పని. క్రీస్తు ఎవరినీ కేటాయించేవాడు కాదు. అందరిపట్ల ప్రేమ చూపేవాడు. అందరిలోను మంచిని చూచేవాడు.

యేసు స్నాపక యోహానులాగ సన్యాసియై ఏకాంత జీవితం గడపలేదు. ఎడారిలో వసించలేదు. ఎప్పడూ జనం మధ్యనే తిరుగుతుండేవాడు. అతని దృష్టిలో మనం ఈ లోక వ్యామోహాలకు చెందినవాళ్ళంకాదు - యోహా 17,15-16. ఐనా అతడు ఈ ప్రపంచాన్ని త్యజించమని ఏనాడు బోధించలేదు. క్రీస్తు చాల పర్యాయాలు ఏకాంత స్థలాల్లో తండ్రికి ప్రార్థన చేసికొనేవాడు - లూకా 5,16.6,2. కాని ఈ ప్రార్థన ముగియగానే