పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువమీద ఆధారపడ్డమూ అతన్ని నమ్మకొని జీవించడమూ దీనుల లక్షణం అని చెప్పాం. క్రీస్తు శిష్యుడికి గూడ ఈ లక్షణమే వుండాలి. మరో తావులో నూత్నవేదం చిన్నబిడ్డనుగూర్చి చెప్తుంది. చిన్నబిడ్డడు తనమీద తాను ఆధారపడడు. తల్లిదండ్రులమీద ఆధారపడి జీవిస్తాడు. ఆలాగే శిష్యుడుకూడ ప్రభువమీద ఆధారపడి జీవించాలి, అప్పడే అతడు దైవరాజ్యంలో ప్రవేశించేది - మత్త 18,3. కనుక దీనాత్మడికి ఈ చిన్నబిడ్డడి మనస్తత్వం అవసరం. పూర్వం కొందరు యూదులు తమ పుణ్యకార్యాలే తమ్మురక్షిస్తాయి అనుకొన్నారు. ఇక దేవుని అనుగ్రహంతో పనిలేదు అనుకొని విర్రవీగారు. దీనాత్ముడు ఈలా భావించడు. అతడు మోక్షంమీద తనకేమో హక్కుంది అనుకోడు. ప్రభువే దాన్నితనకు ఓ వరంగా దయచేస్తాడు అని యెంచుతాడు. ఆ ప్రభువుమీద ఆశపెట్టుకొని జీవిస్తాడు.

మామూలుగా మనం మేము అంతటివాళ్ళం ఇంతటివాళ్ళం అనుకొంటాం. భావిస్తాం. నాకు నేను చాలనా అనుకొంటాం. మిడిసిపడతాం. ఇది శిష్యలక్షణంకాదు. శిష్యుడు నేను చేతగానివాణ్ణి అనుకొని ప్రభువమీద ఆధారపడుతూండాలి, వినయంతో అతన్ని శరణు వేడుతూండాలి. ఈలాంటివాళ్ళే హనవిం, లేక దీనులు. వీళ్ళ లక్షణాలను అలవర్చుకొన్నపుడే మనంగూడ శిష్యులమయ్యేది.

2. ఉప్పూ, వెలుగూ

ప్రభువు శిష్యులను ఉప్పతోను వెలుగుతోను పోల్చాడు - మత్త 5,13-16, మొదట ఉప్పను పరిశీలిద్దాం. దానిలో రెండు గణాలున్నాయి. అది భోజనానికి రుచినిస్తుంది. ఉప్పలేని కూర ఏలావుంటుందో మనకు తెలుసు. ఇంకా, వుప్ప భోజనం చెడిపోకుండా పదిలపరుస్తుంది. శిష్యులు ఇతరులకు ప్రభువు వాక్యం విన్పిస్తుండాలి. ప్రభువుపట్లా అతని వాక్యం పట్లా ప్రజలకు రుచి కలిగిస్తుండాలి. ప్రభువు వాక్యం ప్రజల హృదయాల్లో ప్రవేశిస్తే ఆ ప్రజలు ఇక చెడిపోరు. పదిలంగా నిలుస్తారు. కనుక భోజనంలో ఉప్ప ఏమి చేస్తుందో లోకంలో శిష్యులు అది చేయాలి. వాళ్ళు తమ ఉప్పందనాన్ని కోల్పోయి నిస్సారులైన నరులుగా తయారుకాకూడదు. మృతసముద్రం నీళ్ళనుండి తయారైన ఉప్పలో ఉప్పందనముండదు. శిష్యులు కూడ ఈలాగే భ్రష్టులైపోవచ్చు. యూదా ఈలా తయారయ్యాడు. దేమా అనే శిష్యుడు లోకవస్తువ్యామోహంలో పడిపోయి పౌలును విడనాడాడు-2 తిమొు 4,10. మనం ఈలా కాకూడదు.

రబ్బయిలు మోషే ధర్మశాస్తాన్ని భోజనంలోని ఉప్పతో పోల్చారు. అది ఈ జీవితానికి రుచినిస్తుంది అన్నారు. ఎప్పడూ ఉప్పలా వుండి లోకానికి క్రీస్తు విలువలు అనే రుచినిస్తూ దాన్ని పదిలపరుస్తూండడం శిష్యుడి ధర్మం.