పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. క్రీస్తు తాను బోధించిన సత్యాలన్నీ స్వయంగా ఆచరించి చూపించాడు. వాటిల్లో ఒక్కటి చాల విలువైంది వుంది. అదే సిలువ. క్రీస్తు మొదట శ్రమలు అనుభవించి అటుపిమ్మట మహిమను పొందడం ఆనివార్యం - లూకా 24,26. తండ్రి ఆ ప్రభువుకి మొదట సిలువ మరణాన్నీ అటుపిమ్మట ఉత్తాన మహిమనీ ప్రసాదించాడు. ఈనాడు మనం కష్టాలు లేకుండానే సుఖాలు పొందగోరుతూన్నాం. సిలువ లేకుండానే ఉత్తానాన్ని ఆశిస్తూన్నాం. ఇది పెద్ద పొరపాటు, క్రీస్తు విలువలను తారుమారు చేయడం.

నేడు లోకం సుఖభోగాలవైపు మొగ్గుతూంది. సినిమా, టీవీ లాంటి సమాచార సాధనాలూ, శాస్త్రపరిశోధనలవల్ల లభ్యమయ్యే ఆధునిక సదుపాయాలూ మొదలైనవన్నీ సుఖభోగాలను అనుభవించడమే ధ్యేయంగా పెట్టుకొంటున్నాయి. తినడం, త్రాగడం, శారీరక సుఖాలు అనుభవించడం మొదలైన విలువలను లోకం హోరాహోరీగా ప్రచారం చేస్తూంది. ఈలాంటి విలువల్లో సిలువకు తావుంటుందా? అయినా ఆ సిలువ అనేది మన గురువు బోధించిన, ఆచరించి చూపించిన గొప్ప విలువ, మరి దాన్ని పాటించకపోతే మనమేమి శిష్యులం? క్రీస్తు అడుగుజాడల్లో నడవకపోతే మనమేమి అనుచరులం? - 1 పేత్రు 2, 21.

2. శిష్యధర్మాలూ పర్వతప్రసంగము

మత్తయి 5–7 అధ్యాయాల్లో పర్వత ప్రసంగాన్ని చదువుతాం. క్రీస్తు చేసిన ఈ ప్రసంగంనూత్నవేదానికంతటికీ గుండెకాయలాంటిది. సువిశేషసారమంతా దీనిలోనేయిమిడి వుంది. ఇక ఈ ప్రసంగంకూడ చాలాశిష్యధర్మాలను పేర్కొంటుంది. ఇక్కడ ఈ ధర్మాలను ఎన్మిందిటిని సంగ్రహంగా వివరిస్తున్నాం.

1.దీనాత్మలు

మొదటి ధన్యవచనం శిష్యుడు దీనాత్ముడై వుండాలి అని చెప్తుంది - మత్త 5,8. పూర్వవేదంలో "హనవిం” అనే ఓ శాఖ ప్రజలు ఉండేవాళ్లు. వీళ్లు తరచుగా పేదలు, కష్టాలకు గురైనవాళ్ళు ప్రభువుమీద ఆధారపడి జీవించడం వీళ్ళ ముఖ్య లక్షణం. వీళ్లే దీనులు. ಔಏನ್ ప్రవక్త ఈ శాఖవాళ్ళని గూర్చి చెపూ “నేనిచట దీనులూ దరిద్రులూ ఐన ప్రజలను ఉంచుతాను. వాళ్ళు నా సహాయాన్ని వేడుతారు" అంటాడు - 3,12, పూర్వవేదంలో దీనుల ప్రతినిధి బాధామయ సేవకుడు,యెషయా ప్రవచనంలో ఈ సేవకుడు "ప్రభువు ఆత్మ నా మీదికి దిగివచ్చింది. దీనులకు సువార్తను ప్రకటించడానికి ప్రభువు నన్ను అభిషేకించాడు" అంటాడు - 61,1.