పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవిస్తే వాళ్ళ విలక్షణంగా కన్పిస్తారు. లోకం వాల్లెవరని ప్రశ్నిస్తుంది. వాళ్ల క్రీస్తు శిష్యులని తెలిసికొంటుంది - యోహ 13, 34-35.

11. పర్యవసానం

ఇంతవరకు క్రీస్తు శిష్యుల లక్షణాలను పరిశీలించాం, కడన రెండు మూడు పర్యవసానాలను తిలకిద్దాం.

1. క్రైస్తవ జీవితమంటే ఏవో కొన్ని ఆజ్ఞలను పాటించడంగాదు. కొన్ని సిద్ధాంతాలను నమ్మడమూ కాదు. ఒక వ్యక్తిని అనుసరించడం. ఉత్థానుడై క్రైస్తవ ඉරාකීත්‍යාපෘෂ්ටඒ* సజీవంగా నెలకొనివున్న క్రీస్తుని నాయకుణ్ణిగా అంగీకరించి అతన్ని వెంబడించడం. కొందరు కమ్యూనిస్టుపార్టీలో చేరతారు. మరికొందరు కాంగ్రెసులోనో జనతాలోనో చేరతారు. ఈ పార్టీల సభ్యులు కొన్ని సూత్రాలనూ సిద్ధాంతాలనూ పాటిస్తారు. ఇక్కడ సిద్దాంతాలను విలువేగాని ఆ సిద్దాంతాలను బోధించిన వ్యక్తి విలువ వుండదు. క్రైస్తవ మతం గూడ ఈలాగే కొన్ని నియమాలను పాటించి కొన్ని సిద్ధాంతాలను నమ్మేదిమాత్రమే కాదు. అది ఓ సజీవుడైన వ్యక్తిని, ఉత్తాన క్రీస్తుని అనుసరించేది. ఆ నాయకుని అడుగుజాడల్లో నడిచేది. కనుక క్రైస్తవ భక్తునికి ఈ ప్రభువుపట్ల అనుభవం ముఖ్యం. ఈ యనుభవం ఏర్పడేంతవరకూ మనం క్రైస్తవులమని చెప్పకోనేగూడదు. ఈలాగే గురుజీవితమూ కన్యాజీవితమూ కూడ కొన్ని నిర్జీవ సూత్రాలనూ సిద్ధాంతాలనూ పాటించేది మాత్రమేకాదు. కొన్ని మఠనియమాలకు కట్టువడి వుండేది మాత్రమేకాదు. సజీవ క్రీస్తుని నాయకుణ్ణిగా అంగీకరించి అతని వెనువెంట నడచిపోయేవాళ్ళు గురువులూ మఠకన్యలూను.

2. మాములుగా మన గురువులూ బోధకులూ ప్రార్థనా మందిరాల్లో క్రీస్తు బోధలను పునశ్చరణంచేసి దానితోనే తమబాధ్యత తీరిపోయినట్లుగా భావిస్తారు. ఇది పెద్ద పొరపాటు, క్రీస్తు శిష్యులు ఆ గురువు బోధలను పునశ్చరణం చేసేవాళ్ళు కాదు, అతని జీవిత విధానాన్ని అనుసరించేవాళ్ళు అని చెప్పాం. కనుక ఈనాడు మనం అతని ఉపదేశాలను వల్లెవేయడంగాదు, అతనిలా జీవించడం ముఖ్యం. ఆచరణశుద్ధి అలవర్చుకోవడం లేక ఆ ప్రభువు జీవితానికి సాక్ష్యంగా వుండడం అంటే యిదే, సోదరప్రేమ, సిలువ, చిత్తశుద్ధితో కూడిన ఆరాధన మొదలైనవి క్రీస్తు జీవితంలోని ముఖ్యాంశాలు. ఈ యంశాలను మనం కేవలం మాటలతో బోధిస్తేనే చాలదు. ఈ సత్యాలను మనం స్వయంగా జీవించి చూపించగలిగి వుండాలి. అప్పడే మనం ఆ ప్రభువుకి సాక్ష్యంగా వుండేది, లోకం మనలను నమ్మేదీను. ఈ విషయాన్ని మూడవ అధ్యాయంలో విపులంగా వివరిస్తాం.