పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతీతవ్యక్తినిగా భావించారని అర్థం చేసికోవాలి. తండ్రి చెంతనుండి వచ్చిన ఓ దివ్యష్టిగా గుర్తించారని తెలిసికోవాలి. కనుకనే వాళ్ళ అన్నిటినీ వదలిపెట్టి అతనివెంట వెళ్లారు - లూకా 5,11. యూదులు సంప్రదాయంలో శిష్యులు తమ రబ్బయుల విజ్ఞానాన్నీ బోధనా పాటవాన్నీ మెచ్చుకొన్నారేగాని వాళ్ళను దివ్యలనుగా విశ్వసింపలేదు.

5. శిష్యులు క్రీస్తు అధికారానికి బదులయ్యారు

రబ్బయిలూ వారి శిష్యులూ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలకు బదులయ్యారు. ఏరబ్బయిగూడ తనఅధికారాన్నే ప్రమాణంగా చూపించి నేను చెప్తున్నాను మీరు వినండి అనలేదు. వాళ్ళు ఎప్పడుకూడ మోషే ఆజ్ఞలనే ప్రమాణంగా చూపించేవాళ్ళు, కాని క్రీస్తు మోషే ధర్మశాస్తాన్నిగాక తన అధికారాన్నే ప్రమాణంగా చూపించాడు. నేను చెప్తున్నాను మీరు వినండి అన్నాడు. మోషే ఐతే శత్రువులమీద పగతీర్చుకొమ్మని చెప్పాడు, కాని నేను శత్రువుని ప్రేమించమని చెపున్నాను అన్నాడు – మత్త 5, 43-44. తాను సొంత అధికారంగలవాడిలాగ బోధించాడు. అతనికి ముందు ఏ రబ్బయికూడ అలా బోధించలేదు. కనుకనే అతని బోధలు విని ప్రజలు విస్తుపోయారు - మత్త 7, 28-29. పైగా అతడు తనకోసమే శిష్యులు అన్నిటినీ, చివరికి తల్లిదండ్రులనుగూడ, పరిత్యజించాలని కోరాడు - మత్త 10, 37 శిష్యులు ఆలాగే చేసారు. ఆ గురువు ఆజ్ఞ ఈయగానే వాళ్ళు విధేయులయ్యారు. అతడు గాడిదపిల్లను తోలుకొని రమ్మనగానే వాళ్ళ సేవకుల్లాగ వెళ్లి దాన్ని తీసికొని వచ్చారు - మార్కు 14, 1-6. అతని ఆజ్ఞలను పాటించడమే శిష్యుల విధి - యోహా 14,15. ప్రభువు శిష్యులపట్లగల ఆదరంచేత వాళ్ళను సేవకులనుగా గాక మిత్రులనుగా పరిగణించాడు - యోహా 15, 15. కాని వాళ్లేమో వస్తుతః సేవకులే. యూదుల గురుశిష్య సంబంధంలో ఈ అధికార భావమూ, ఈ విధేయతాభావమూ గోచరించదు. ఈవిషయంలో గూడ క్రీస్తు ఇతర రబ్బయిలకంటె భిన్నంగా ప్రవర్తించాడు.

6. క్రీస్తు శిష్యులకు తగింది పెత్తనంగాదు, పరిచారం

రబ్బయిల శిష్యులు కొంతకాలం తర్ఫీదు పొందినంక తాముగూడ రబ్బయిలయ్యేవాళ్ళ తామూ అధికారపూర్వకంగా మోషే ధర్మశాస్తాన్ని బోధించేవాళ్ళు కాని క్రీస్తు శిష్యులు ఈలా రబ్బయిలు కావడానికి వీల్లేదు. బోధకుడు, తండ్రి, గురువు మొదలైన బిరుదాలు యేసు శిష్యులకు చెల్లవు. అనాడు కొందరు రబ్బయిలు ఈ బిరుదాలను వాడుకొని గర్వంతో పొంగిపోయారు. అందుకే ప్రభువు తన శిష్యులకు ఈ బిరుదాలను నిషేధించాడు - మత్త 23,8-11. క్రీస్తువల్ల తర్ఫీదుపొంది అతనిలా తయారుకావడమే శిష్యుల ఆశయం. కాని క్రీస్తులా తయారు కావడమంటే ఏమిటి? అతడు అందరికీ