పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు సుంకపుశాలలో గూర్చుండి సుంకాలు వసూలు చేసే మత్తయిని పిల్చాడు. యూదులకు డబ్బంటే పంచప్రాణాలు లేచివస్తాయి. కాని మత్తయి ఆ కాసులనుగూడ అక్కడే వదలిపెట్టి క్రీస్తువెంట వెళ్ళిపోయాడు - మార్కు 2,14. ఆలాగే యేసు అంజూరం క్రింద కూర్చుండివున్న నతనియేలు తన శిష్యుడు కావాలని కోరుకొన్నాడు. కోరినట్లే నతనియేలు వచ్చి అతని శిష్యవర్గంలో చేరిపోయాడు - యోహా 1, 47-49. ఈ వుదాహారణలను బట్టి క్రీస్తు శిష్యులను బలంగా ఆకర్షించాడనీ, వాళ్ళ అతని వ్యక్తిత్వానికి ముగ్గులైపోయారనీ అర్థంజేసి కోవాలి. వాళ్ళ తమ పూర్వజీవితంతో తెగతెంపులు చేసికొని అతిశీఘంగా అతని శిష్యులైపోయారని గుర్తించాలి.

ఇంకా, క్రీస్తు చనిపోయాక శిష్యులకు అతనిపట్ల వున్న ఆదరాభిమానాలను నిలబెట్టిందేమిటి? క్రీస్తు బోధలుకాదు, అతని వ్యక్తిత్వమే. క్రీస్తు మరణానంతరం ఎమ్మావుకు వెళ్ళిన శిష్యులు అతడు “వాక్యంలోను క్రియలోను శక్తిగల ప్రవక్త" అని నమ్మారు. ఈ వ్యక్లేవాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టింది - లూకా 24, 19. ఆలాగే క్రీస్తు ఉత్థానమై పరిశుద్ధాత్మ దిగివచ్చాక శిష్యులు అతని బోధలకు గాదు, అతని జీవితానికి సాక్ష్యంగా వుండాలి - అచ 1,8. ఈ చర్చ అంతటినిబట్టి తేలిందేమిటంటే క్రీస్తు శిష్యులకు అతని బోధలు కాదు, అతడే ముఖ్యం.

4. క్రీస్తుపట్ల విశ్వాసం ప్రధానం

5వ శతాబ్దంలో బాబిలోను ప్రవాసంనుండి తిరిగివచ్చిన యూదులు ధర్మశాస్తాన్ని జాగ్రత్తగా పాటించడం మొదలెట్టారు. వాళ్ళ రబ్బయిలు ధర్మశాస్తాన్నిక్షుణ్ణంగా బోధించడం ప్రారంభించారు. ఆ శాస్తాన్ని బాగా అర్థం చేసికొని నేర్పుతో బోధించగలిగిన రబ్బయిలను శిష్యులు ఎంతో గౌరవించేవాళ్ళ క్రీస్తుకు కొలదియేండ్లపూర్వం వర్ధిల్లిన అఖిబా, హిలెల్, షమ్మయి మొదలైనవాళ్ళు ఈలాంటి రబ్బయిలే. ఇంకా గ్రీకు సంప్రదాయంలో శిష్యులు సోక్రటీసు, ప్లేటో వంటి ఉత్తమ విద్వాంసుల విజ్ఞానాన్ని జూచి ఆ గురువులను గౌరవించారు. కాని క్రీస్తు విషయం ఆలాకాదు. అఖిబా, సోక్రటీసు మొదలైన గురువుల శిష్యులు వాళ్ళపట్ల చూపని విశ్వాసాన్ని క్రీస్తు శిష్యులు అతనిపట్ల చూపారు. ఇక్కడ విజ్ఞానంకాదు, విశ్వాసం ముఖ్యం. క్రీస్తు తన్ను నమ్మి జ్ఞానస్నానం పొందిన వాడికి రక్షణం వుంటుందని నుడివాడు - మార్కు 16, 16. పేతురు విశ్వాసం తొలగిపోకుండా వుండడానికై ప్రభువు ముందుగానే అతని కొరకు ప్రార్ధనం చేసాడు - లూకా 22, 32. అదే పేతురు క్రీస్తుతో "ప్రభూ! మేము ఎవరివద్దకు వెళాం! నీవు దేవుని చెంతనుండి వచ్చిన పవిత్రమూర్తివని విశ్వసిస్తున్నాం" అన్నాడు — యోహా 6, 68-69. ఈలాంటి సందర్భాలనుబట్టి శిష్యులు క్రీస్తుని ఓ