పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సువిశేషాల్లో శిష్యశబ్దాన్ని ప్రత్యేకార్థంలో వాడారు. క్రీస్తుని ప్రత్యక్షంగా ఎరిగివుండి అతన్ని అనుసరించేవాళ్లు శిష్యులు. కాని అపోస్తలుల చర్యలు గ్రంథం వ్రాసేప్పటికల్లా ఈ శబ్దం మారిపోయింద. ప్రభువుని ప్రత్యక్షంగా ఎరిగివున్నా లేకపోయినా అతన్ని విశ్వసించి అతని బోధలను పాటించే వాళ్లనందరినీ ఈ గ్రంథం శిష్యులనుగా అంగీకరించింది - అచ 6,1. 9,1. నేడు మనంకూడ శిష్యశబ్దాన్ని ఈ విస్తృతార్థంలోనే వాడుతూన్నాం.

2. క్రీస్తే తన శిష్యులను ఎన్నుకొన్నాడు.

గ్రీసుదేశంలో శిష్యులే గురువుని ఎన్నుకొన్నారు. ఆలాగే యూదులల్లోకూడ శిష్యులే తమ రబ్బయిలను ఎన్నుకొన్నారు. మనదేశంలో ఋషులసంగతి చెప్పవలసివచ్చినపుడు కూడ శిష్యులే తమ గురువుని ఎంపిక చేసికొనేవారు. కాని క్రీస్తు విషయంలో మాత్రం ఈలా కాదు. అతడే తన శిష్యులను నిర్ణయించుకొన్నాడు. ఇది అసాధారణమైన విషయం. "మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మ ఎన్నుకొన్నాను" అన్నాడు ప్రభువు - యోహా 15,16. మీరు నావెంట రండి, నేను మీచే చేపలకు బదులుగా మనుష్యులను పట్టిస్తాను అని పల్కాడు - మత్త 4, 19-20. ప్రభువు తండ్రే తనగొర్రెలను తనకు అప్పగించినట్లుగా కూడ మరోతావులో చెప్పకొన్నాడు - యోహా 10,29.

క్రీస్తు అర్హతలేనివాళ్లనుకూడ కొందరిని తన శిష్యులను చేసికొన్నాడు. ఉదాహరణకు యూదుల్లో అట్టడుగు వర్గమైన సుంకరులకు రబ్బయిల శిష్యులయ్యే అర్హత లేదు. అగ్రవర్గం వాళ్లు వీళ్లని అసహ్యించుకొనేవాళ్లు - లూకా 15,1-2. కాని ఈ క్రిందివర్గంవారి నుండే లేవీని శిష్యుణ్ణిగా ఎన్నుకొన్నాడు క్రీస్తు - మార్కు 2,14. దీన్నిబట్టి లోకం అయోగ్యులనుగా ఎంచే వాళ్లనుగూడ ప్రభువు తన శిష్యుల్లో చేర్చుకొన్నాడు అనుకోవాలి. కొందరు శిష్యులకు పెద్ద తెలివితేటలుగూడ లేవు. ఐనా ప్రభవు వాళ్లనే ఎంపిక చేసాడు. ఈ సత్యాన్ని గుర్తించే తర్వాత పౌలు "ప్రభువు లోకం అవివేకులనుగా ఎంచేవాళ్లను ఎన్నుకొని తాము వివేకులమనుకొనే వాళ్లనందరినీ సిగ్గుపరచాడు" అని నుడివాడు - 1 కొరి 1, 27-28. అనగా శిష్యులశక్తి క్రీస్తునుండే గాని తమనుండి కాదని భావం.

3. గురవు నేర్చే జ్ఞానంకాదు, గురువే ముఖ్యం

పూర్వవేదంలోని తొలి ఐదుగ్రంథాలకు టోర అనిపేరు. అదే ధర్మశాస్త్రం. యూదులకు ఈ టోర ఎంతో ముఖ్యమైనది. దాన్ని నేర్చుకోవడానికే వాళ్ల శిష్యులు రబ్బయిలదగ్గరికి వెళ్లారు. ఆలాగే గ్రీసుదేశంలో విజ్ఞానాన్ని ఆర్జించడానికి శిష్యులు సోక్రిటీసులాంటి గురువులను ఆశ్రయించారు. మన ప్రాచీన గురుకులాల్లో గూడ బ్రహ్మవిద్యను నేర్చుకోవడానికి శిష్యులు ఋషులను ఆశ్రయించారు. ఈ మూడు