పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీరు వృద్దులయ్యేదాక నేను మీకు దేవుణ్ణి
మీ తల నెరిసేవరకు నేను మిమ్మ మోస్తాను
నేను మిమ్ము సృజించాను, మిమ్ము భరించాను
మిమ్మ మోస్తాను, రక్షిస్తాను.

అన్యజాతివారి దేవుళ్ళను వారి పశువులు మోస్తే, యిస్రాయేలును యావేప్రభువు ఓ గర్భవతిలాగ తన కడుపులో మోస్తాడు. అనగా ఆ జాతి పుట్టినప్పటినుండి ప్రభువు వారిని కాపాడుతూ వచ్చాడని భావం. వాళ్ళు ముసలివాళ్ళయి పోయేవరకు కూడ యావే వారిని మోస్తూ, సంరక్షిస్తూ ఉంటాడు. కనుక తమ్ము భరించే ప్రభువుని నమ్మడం యిస్రాయేలుకు అన్నివిధాల శ్రేయస్కరం. ఇక్కడ మనకు కావలసింది యూవే గర్భిణిలాంటివాడు అనే భావం.

10. స్త్రీమూర్తిగా జ్ఞానం:

పూర్వవేదంలో జ్ఞానం ఓ పెద్ద అంశం. దీనికి హీబ్రూలో హోక్మా అనీ, గ్రీకులో సోఫియా అనీ పేర్లు, ఇవి రెండూ స్త్రీ లింగాలు. కనుక పూర్వవేదంలో జ్ఞానం ఓరకమైన దివ్యశక్తిగా, దేవతగా, దివ్యమాతగా, ఉత్రేక్షింపబడింది. చాల పర్యాయాలు ఇది భగవంతుణ్ణి సూచిస్తుంది. కాని అతన్ని స్త్రీనిగా సూచిస్తుంది.

అసలు జ్ఞానం అంటే యేమిటి? అది భగవంతుని అంశ, లేక శక్తి, లేక గుణం. భగవంతుని దివ్యశక్తిని సూచించే ఓ వ్యక్తి అనగా యూదులు భగవంతుని దివ్య గుణాన్ని ఓ వ్యక్తినిగా, ఓ స్త్రీమూర్తినిగా భావించారన్నమాట. ఈమె బాబిలోనియులు కొల్చే అస్టార్టె అనే దేవతకు దీటుగా ఉంటుంది.

ఈ జ్ఞానం ఏంచేస్తుంది? నరులకు మంచి చెడ్డలను తెలిసికొనే శక్తినిస్తుంది. జీవితంలో వారికి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఏ కార్యాన్ని ఎలాచేయాలో నేర్పుతుంది. జీవిత అనుభవాల సారాన్నితెలియజేస్తుంది. ఈ గుణం కలవాడు జ్ఞానియై దేవకీ నరులకూ కూడ ప్రీతి కలిగిస్తాడు. అది నరుడ్డి రక్షిస్తుంది. బైబుల్లో జ్ఞానగ్రంథాలు ఏడు ఉన్నాయి.

బైబులు జ్ఞానాన్ని ఫ్రీమూర్తినిగా చిత్రిస్తుంది అన్నాం. ఆమెకు సృష్టికర్రి, తల్లి వధువు, భార్య, ఉపాధ్యాయ, ఆతిథేయ అనే ఉపమానాలు వాడుతుంది. ఈ నాల్డింటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. సృష్టికర్తిగా జ్ఞానం

సామెతల గ్రంథం 8, 22-31 జ్ఞానాన్ని సృష్టికర్రినిగా వర్ణిస్తుంది. ప్రభువు మొదట చేసిన సృష్టి జ్ఞానమే - 8,22. కనుక దానికి తర్వాత జరిగిన సృష్టిమీద అధికారముంది. ఆమె భగవంతునితో కలసి తానూ సృష్టికార్యంలో పాల్గొంది - 8, 30.