పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనే పనికత్తె దేవుడు అనే యజమానురాలి హస్తాలవైపు ఆశతో చూస్తుండాలి. అతడిచ్చే పదార్థాల కొరకు కాచుకొని ఉండాలి. అనగా యిస్రాయేలు దేవుని ఆదరాభిమానాల కొరకూ రక్షణంకొరకూ ఆశతో ఎదురు చూస్తుండాలని భావం. కరుణగల యజమానురాలు పనికత్తెలనులాగ, ప్రభువు యిస్రాయేలును తప్పక ఆదుకొంటాడని అర్థం, ఇది నేడు మన ప్రార్ధనలో మనంకూడ వాడుకోదగ్గ మంచి భావం.

8.బట్టలుకుట్టే తల్లిగా దేవుడు

ఆదాము ఏవ పాపం చేయనంతవరకు దిసమొలతోనే ఉన్నారు. ఐనా వారికి సిగ్గవేయలేదు. అనగా వారిలో ఇంకా కామం లేదు. ఉద్రేకం లేదు. ఇంద్రియాలు పూర్తిగా అదుపులో ఉన్నాయి - ఆది 2,25. కాని ఆదాము పాపం చేయగానే ఈ భాగ్యస్థితి పోయింది. వాళ్ళు జంతువాంఛలకు లొంగిప్రోయారు. తమ దిసమొలను చూచి తామే సిగ్గుపడి అంజూరపు ఆకులతో కప్పకొన్నారు - 3,7. అనగా పాపఫలితంగా వారిలో కామం ఉద్భవించిందని భావం. తర్వాత దేవుడు వారిని శిక్షించినా వారిమీద కరుణ జూపాడు. జంతుచర్మంతో బట్టలునేసి ఆదామేవలకు తొడిగాడు - 3,21. ఇది గమనింపదగిన వాక్యం. ఇక్కడ రచయిత దేవుణ్ణి బట్టలుకుట్టి బిడ్డలకు తోడిగే తల్లితో పోల్చాడు. అనగా దేవుడు నెనరుతో ప్రజలను పట్టించుకొనేవాడని భావం.

9. బిడ్డలను మోసే గర్భవతిగా యావే

రెండవ యెషయా ప్రవక్త దేవుణ్ణి బిడ్డలను కడుపులో మోసే గర్భవతితో పోల్చాడు - 46,1-4. బాబిలోనీయులు బేలు, నెబో అనే దేవతలను కొల్చేవాళ్ళ. పర్యా రాజయిన కోరెషు దండెత్తి వస్తున్నాడని విని వాళ్ళ భయంతో ఆ దేవతల విగ్రహాలను పశువులమీది కెక్కించుకొని పారిపోయారు. ఆ బొమ్మలను వాళ్లే మోసికొనిపోవాలి. అవి స్వయంగా నడువలేవు. వాటికి శక్తి లేదు. అవి తమ భక్తులను కాపాడలేవుకూడ ఈ బొమ్మలతో పోలిస్తే యిప్రాయేలు దేవుడైన యావే సజీవుడు, శక్తిమంతుడు. తన భక్తులను తానే మోసికొనిపోయేవాడు.

యాకోబు వంశజులారా!
యిస్రాయేలున మిగిలియున్నవారలారా!
నా మాటలు వినండి
మీరు పట్టినప్పటినుండి నేను మిమ్మ భరించాను
మీరు జన్మించినప్పటినుండి నేను మిమ్మ మోసాను