పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. మంత్రసానిగా ప్రభువు

కీర్తనకారుడు యావేను, ప్రసవిస్తూన్న స్త్రీ గర్భం నుండి బిడ్డను వెలికితీసే మంత్రసానితో ఉపమించాడు. 22,9-10. ఈ గీతంలో భక్తుడు ఏదో ఆపదలో ఉండి ప్రభుని శరణు వేడుతున్నాడు.

తల్లి కడుపునుండి నన్ను సురక్షితంగా
బయటికి కొనివచ్చింది నీవే
నేను మాతృస్తన్యాన్ని గ్రోలి
భద్రంగా మనేలా చేసింది నీవే
మాతృ గర్భంనుండి వెలువడి నప్పటినుండి
నేను నీమీదనే ఆధారపడ్డాను
నేను జన్మించినప్పటినుండి నీవే నాకు దేవుడివి.

మంత్రసాని తల్లి గర్భంనుండి బిడ్డను వెలికితీస్తుంది. ఆలాగే దేవుడు ఓ మంత్రసానిలాగ తన్ను తల్లి గర్భంనుండి బయటికి తీసాడని భావం. మంత్రసాని బిడ్డను తల్లిరొమ్ము ప్రక్కన పండుకోబెట్టి పాలు కుడిపిస్తుంది. దేవుడు ఓ మంత్రసానిలాగ తనచే తల్లి రొమ్మునుండి పాలు త్రాగించాడని భక్తని భావం. అనగా కీర్తనకారుడు జన్మించినప్పటి నుండి ప్రభువే అతన్నిసాకుతూ వచ్చాడని అర్థం. చంటిబిడ్డడుగా ఉన్నప్పటినుండి తన్ను కాపాడిన దేవుడు ఇప్పడు ఆపదలో తన్ను రక్షించాలని భక్తుని మొర. ఇవి చాల భక్తిగల భావాలు. భగవంతుణ్ణి పూర్ణంగా నమ్మిన నరుడేగాని ఈలాంటి ఆలోచనలను వెలిబుచ్చలేడు.

7. ఇంటి యజమానురాలుగా యావే

మరో కీర్తనకారుడు యావే ప్రభువుని యింటి యజమానురాలితో పోల్చాడు - 123,23.

సేవకుల కన్నులు యజమానుని చేతిమీదను
సేవికల కన్నులు యజమానురాలి చేతిమీదను
ఏలా నిల్చివుంటాయో ఆలాగే
మన దేవుడైన ప్రభువు మనలను కరుణించేదాకా
మన కన్నులను అతనిమీద నిల్పివుంచుదాం.

యజమానురాలు ఇంటిలోని పనికత్తెలకు అన్నపానీయాలు బట్టలూ అందించి వారిని సంరక్షిస్తుంది. కనుక పనికత్తెలు ఆశతో ఆమె చేతులవైపు చూస్తుంటారు. ఆమె చేతులతో అందించే పదార్థాలను కృతజ్ఞతతో, వినయంతో స్వీకరిస్తారు. ఆలాగే యిప్రాయేలు