పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన వొడిలో కూర్చుండబెట్టుకొని లాలిస్తుంది
తల్లి కుమారునిలాగే నేనూ మిమ్ము ఓదారుస్తాను
యెరూషలేమున మిమ్మ అనునయిస్తాను.

తల్లి కుమారుని ఓదార్చి బుజ్జగించినట్లుగా ప్రభువు యిప్రాయేలును బుజ్జగిస్తాడు. అతడు ప్రవాసంలో యూదులు అనుభవిస్తున్న దుఃఖాన్ని అవమానాన్ని శ్రీఘ్రమే తొలగిస్తాడు. ఆ ప్రభువు తల్లిలా తన బిడ్డల కొరకు ఆందోళనం చెందేవాడు. మనకు తెలిసిన ప్రేమలన్నిటిలోను తల్లిప్రేమ బలీయమైంది. దానికిమించిన అనురాగం నరమాత్రులమైన మనకు తెలియదు. భగవంతుని ప్రేమ ఈ ప్రేమలాంటిది, దాన్ని మించిందికూడ దేవుణ్ణిగూర్చి ఇంతకంటె యొక్కువగా ఏమి చెప్పగలం?

3. కరుణగల తల్లిగా దేవుడు

భగవంతుడు యిప్రాయేలీయుల తప్పిదాలను మన్నిస్తాడని చెప్పే సందర్భంలో ప్రవక్తలు అతని కరుణను వర్ణించారు. అతడు ఓ తండ్రిలా తన బిడ్డల దోషాలను మన్నిస్తాడు అని చెప్పేటప్పుడు ప్రవక్తలు "హేసెద్" అనే హీబ్రూ మాటను వాడతారు. కరుణ అని ఈ పదానికి అర్థం. కాని తల్లిలా మన్నిస్తాడు అని చెప్పే సమయంలో "రాహుమిం" అనే హీబ్రూమాట వాడతారు. గర్భకోశం, జాలి అని ఈ రెండవ మాటకు అర్థం.

ఏడవ శతాబ్దానికి చెందిన యిర్మీయా ప్రవక్త బాబిలోనియాలోని ప్రవాసులను గూర్చి చెప్తున్నాడు — 31,15-20 యూదులకు తల్లియైన రాహేలు తన బిడ్డలను కోల్పోయినందుకు, అనగా వాళ్ళ ప్రవాసానికి వెళ్ళిపోయినందుకు విలపించింది -15. ప్రభువు ఆమెను ఓదార్చి నీ బిడ్డలు ప్రవాసంనుండి మళ్ళా తిరిగివస్తారని చెప్పాడు 16– 17. యిప్రాయేలీయులు (ఎఫ్రాయిూము) దేవుని యెదుట పశ్చాత్తాపపడ్డారు. "నీవు మమ్ము కాడికి లొంగని కోడెను లాగ శిక్షించావు. నీవు మమ్మ వెనుకకు త్రిప్పితే మేము నీచెంతకు తిరిగివస్తాం." అని మొరపెట్టుకొన్నారు. “మా పాపాలకు రొమ్ము బాదుకొంటున్నాం. అవమానంతో తలవంచుకొంటున్నాం" అని పరితపించారు. దేవుడు వారి దుఃఖాన్నీ పశ్చాత్తాపాన్నీ గుర్తించాడు. రాహేలుకి బదులుగా తానే వారికి తల్లి అయ్యాడు. ఈ సందర్భంలో తల్లిలాంటి దేవుడు వారితో ఈలా అన్నాడు - 31,20.

ఎఫ్రాయిూమూ! నీవు నాకిష్ణుడవైన పుత్రుడివి
నాకు ప్రీతిపాత్రుడివి
నేను నిన్ను శిక్షింప బూనినప్పడల్లా
ప్రేమతో నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొంటాను