పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతని మానుష చేతనం ఈ సంగతిని గ్రహించింది. తర్వాత అతడు పెరిగి పెద్దవాడైన పిదప పరలోకంలోని తండ్రిని గూర్చి శిష్యులను బోధించిన సంగతులన్నీ కూడ తన మానుష చేతనంవల్ల గ్రహించినవే అనుకోవాలి.

2. క్రైస్తవులూ - తండ్రి

క్రీస్తు స్వయంగా తండ్రిని అబ్బా అని పిల్చేవాడన్నాం. కాని అతడు తన శిష్యులు కూడ తండ్రిని అదే పేరుతో పిలవాలని కోరుకొన్నాడు. శిష్యులుకూడ తనలాగే దేవునికి చనువుతో ప్రార్థన చేయాలని కోరుకొన్నాడు. కనుకనే తనకు ప్రీతిపాత్రమైన పరలోక జపాన్ని వారికి కూడ నేర్పించాడు.

క్రీస్తు ప్రార్థన చేసికోవడం చూచి శిష్యులు మాకు కూడ ప్రార్థన నేర్పమని అడిగారు. అతడు మీరు ఈలా ప్రార్ధన చేయండి అని చెప్పి పరలోకజపం నేర్పాడు. దానిలో మొదట వచ్చేది "తండ్రీ! నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక" అనే విన్నపం - లూకా 11,2. ఇక్కడ క్రీస్తు తండ్రి అనే పదానికి అరమాయిక్ భాషలో వాడినమాట అబ్బా ఐయుంటుందని బైబులు పండితుల ఊహ. అనగా తాను నాన్నగా అనుభవానికి తెచ్చుకొన్న దేవుడు శిష్యులకుకూడ ఆలాగే అనుభవానికి రావాలని అతని కోరిక ఐయుంటుంది.

ఈ సంప్రదాయాన్ని అనుసరించి తొలినాటి క్రైస్తవులుకూడ దేవుణ్ణి అబ్బా అని పిల్చివుంటారు. పౌలు జాబుల్లో రెండుచోట్ల అబ్బా అన్న మాట వస్తుంది. పవిత్రాత్మ మనచేత దేవుణ్ణి అబ్బా అని పిలిపిస్తుంది - గల 46. మనకు దత్తపుత్రత్వాన్ని ఒసగే ఆత్మ దేవుణ్ణి మనచే అబ్బా అని పిలిపిస్తుంది - రోమా 8,15. ఆ తొలినాటి క్రైస్తవుల ప్రార్థనను చూచే, వాళ్ళ దేవుణ్ణి అబ్బా అని సంబోధించడాన్ని చూచే పౌలు ఈ వాక్యాలు వ్రాసి వుండవచ్చు.

దేవుణ్ణి అబ్బా అని సంబోధించాలి అంటే ఆత్మ సహాయం అవసరం. మనచేత ప్రార్థన చేయించేది ఆ యాత్మే ఇంకా, క్రీస్తు సహాయంకూడ అవసరం. ఆ కుమారునిలోనికి జ్ఞానస్నానం పొంది మనం దేవునికి దత్తపుత్రులమౌతాం. ఈలాంటి బిడ్డలంగానే దేవుణ్ణి అబ్బా అని పిల్వగలుగుతాం. తర్వాత క్రీస్తు మరియ మగ్డలీనను శిష్యుల వద్దకు పంపుతూ "నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు" అనే మాటలు వాడాడు - యోహా 20,17. క్రీస్తుద్వారా అతని తండ్రి మన తండ్రి ఔతాడు. క్రీస్తు మనలను పాపంనుండి విమోచించడానికి మాత్రమే రాలేదు. తన తండ్రికి మనలను గూడ బిడ్డలనుగా జేయడానికి వచ్చాడు. నేడు మనం అబ్బా అనే పదాన్ని పట్టినే ఉచ్చరిస్తేనే చాలదు. ఈ మాటద్వారా దేవుణ్ణి మన తండ్రినిగా, నాన్ననుగా అనుభవానికి తెచ్చుకోవాలి. అతనిపట్ల ప్రేమా,