పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. దేవుని బిడ్డల ప్రవర్తనం

విశ్వాసులు దేవునికి బిడ్డలు. కనుక వాళ్ళు దేవుని ఏకైక కుమారుడైన క్రీస్తుని పోలివుండాలి. అతన్ని అనుసరించాలి. ఈ యనుసరణం ఐదంశాల్లో కన్పించాలి.

1. విధేయత చూపాలి

విశ్వాసులు తండ్రికీ క్రీస్తకీ విధేయులు కావాలి. విధేయత అంటే క్రీస్తు ఆజ్ఞలూ, మాటలూ పాటించడం - 14,15. ప్రభువు ఆజ్ఞలు పాటించేవాడు అతనికంటె గొప్ప కార్యాలు చేస్తాడు - 14,12. దేవునికి విధేయులైనవాళ్ళు అతనికి ప్రీతి కలిగించే పనులు మాత్రమే చేస్తారు.

2. ప్రేమను చూపాలి

దేవుడు ప్రేమస్వరూపుడు -1 యోహా 4,8. అతని బిడ్డలమైన మనంకూడ ప్రేమపూరితులమై యుండాలి. క్రీస్తు మనకు నూత్న ఆజ్ఞనిచ్చాడు. ఇది ప్రేమాజ్ఞ. అనగా మనం ఒకరినొకరం ప్రేమించాలి - 13,34. తండ్రి క్రీస్తుని ప్రేమించినట్లే క్రీస్తు మనలను ప్రేమించాడు- 15,9. ఈ ప్రేమనే మన తరపున మనం తోడివారిపట్ల చూపాలి. తండ్రిని ప్రేమించేవాళ్లు అతని బిడ్డలైన తోడి నరులను గూడ ప్రేమించాలి-1 యోహా 5,2. మనం కండ్గారా జూచే తోడి నరులను ప్రేమించకపోతే, అసలు కంటితో చూడని దేవుణ్ణి ఏలా ప్రేమిస్తాం? -1 యోహా 420. తోడివారిని ప్రేమించేవాళ్ళ వెలుగులో నడుస్తున్నారు అనాలి -1 యోహా 2,10. ఆలా చేయనివాడు చీకట్లో వున్నట్లే - 1 యోహా 2,9.

3. వెలుగులో నడవాలి

దేవుడు వెలుగు. అతనిలో చీకటి యేమాత్రం లేదు - 1 యోహా 1,5, ఈ తండ్రిలాగే క్రీస్తుకూడ వెలుగు- యోహా 8,12. కనుక విశ్వాసులు కూడ వెలుగు కలవాళ్ళగా జీవించాలి - 12,36. నికొదేము చీకట్లో వెలుగైన క్రీస్తు దగ్గరికి వచ్చాడు -3,2. దీనికి భిన్నంగా యూదా వెలుగైన క్రీస్తుని విడనాడి చీకటిలోనికి వెళ్లాడు - 13,30. మన ప్రవర్తనం నికొదెములాగ వుండాలి. పాపకార్యాలు చేసేవాడు వెలుగుని సమీపించలేడు. కాని సత్కార్యాలు చేసేవాడు వెలుగు చెంతకు వస్తాడు - 3,20.

4. శ్రమలు అనుభవించాలి

క్రీస్తుకి శ్రమలు కలిగాయి. ఆలాగే శిష్యులకు కూడ కష్టాలు వస్తాయి - 6,33. ఒకోసారి వాళ్ళ వధకుకూడ గురికావచ్చు -16,3. వాళ్ళు ఈ లోకానికి చెందినవాళ్ళు కాదు. క్రీస్తు ఎన్నుకొన్నవాళ్ళు, కనుక లోకం వారిని ద్వేషిస్తుంది - 15,19. కాని వాళ్లు