పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. తండ్రీ కుమారుల ఐక్యత

క్రీస్తు నేనూ తండ్రీ ఒకటే అని చెప్పాడు - 10,20. అతడు తండ్రి గుణాన్ని తనకు ఆరోపించుకొన్నాడు. పూర్వవేదంలోని యావే ప్రభువు నేను "ఉన్నవాడను అని మోషేకు చెప్పాడు - నిర్గ 3,14. దీనికి సమానంగా క్రీస్తుకూడ "నేనే ఆయనను" అని చెప్మంటాడు - 18,5.

చాల పర్యాయాలు క్రీస్తు తండ్రిగుణాలు తనకు ఆరోపించుకొన్నాడు. పూర్వవేదంలో దేవుడు జీవజలం ఇచ్చేవాడు. క్రీస్తుకూడ జీవజల మిస్తాడు - 4,10. యావేలాగే క్రీస్తుకూడ మంచి కాపరి - 10,11. దేవుడు ప్రజలకు ఎడారిలో మన్నా భోజనం దయచేసాడు. క్రీస్తుకూడ జీవాహారం - 6,35. తండ్రిలాగే కుమారుడు కూడ వెలుగు- 8,12. తండ్రి జీవం కలవాడు. సుతుడుకూడ జీవమిచ్చేవాడు - 5,26. పితలాగే సుతుడుకూడ పనిచేసేవాడు -5,17. పవిత్రాత్మను జనకుడూ కుమారుడూ ఇద్దరూ పంపుతారు- 14,26. 15,36. తండ్రీ కుమారులు ఎంతగా ఐక్యమై యుంటారంటే వారిలో ఒకరికున్నది మరొకరికి కూడ ఉన్నట్లే - 17, 10. ఇంకా పితను గౌరవిస్తే సుతుని గౌరవించినట్లే - 5,23. అతన్ని స్వీకరిస్తే ఇతన్ని స్వీకరించినట్లే - 13,20. అతన్ని చూస్తే ఇతన్ని చూచినట్లే - 14,9.

2. దేవుడు విశ్వాసులకు కూడ తండ్రి

యోహాను భావాల ప్రకారం యావే ప్రభువు క్రీస్తుకి మాత్రమేకాక, విశ్వాసులకుకూడ తండ్రి. దేవుని నుండి పుట్టిన ప్రతివానిలోను అతని ప్రకృతి వుంటుంది - 1 యోహా 3,9. క్రీస్తుద్వారా మనం దేవునికి బిడ్డలమౌతాం. కనుక మనం పితనూ కుమారునీ ఇద్దరను కూడ అనుకరించాలి. మన గొప్పంతా ఈ యిద్దరిని పోలివుండడంలోనే వుంది.

క్రీస్తు తన్నంగీకరించే వాళ్లందరికి దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని దయచేసాడు - 11,12. అనగా క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారా మనం దేవునికి బిడ్డలమౌతామని భావం. కడన, క్రీస్తుద్వారా తప్పితే ఎవడూ తండ్రిని చేరలేడు - 14,6.

తండ్రిని చేరాలంటే క్రీస్తుపట్ల విశ్వాసమే ముఖ్యం. ఈ విశ్వాసం ద్వారా తండ్రికీ క్రీస్తుకీ వుండే సంబంధమే భక్తునికి తండ్రికీ కూడ ఏర్పడుతుంది. అదేలాగో చూద్దాం.

1. పరస్పర ప్రేమ

పితసుతులు ఒకరినొకరు ప్రేమిస్తుంటారని చెప్పాం. ఆలాగే ఆ దైవవ్యక్తులు విశ్వాసులను ప్రేమిస్తారు. విశ్వాసులూ వారిని ప్రేమిస్తారు.