పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు తన అద్భుతాలను తండ్రి నియమించినట్లుగానే చేసాడు. ఆలాగే అతని బోధలు కూడ తండ్రి బోధలే. తండ్రి నాకు నేర్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను అన్నాడు క్రీస్తు - 8,28. కొన్ని పర్యాయాలు క్రీస్తు, తండ్రి నా కంటె గొప్పవాడు అని చెప్తాడు. నరావతారుడుగా అతడు దేవుని కంటె తక్కువవాడు. ఇదికూడ అతని విధేయతనే సూచిస్తుంది.

కుమారుడు అడిగినదంతా పిత ప్రేమతో చేస్తాడు. అతడు అడిగినంతనే జనకుడు పవిత్రాత్మను పంపుతాడు - 14,16. లాజరును జీవంతో లేపుతాడు - 11,41. దేవుడు అబ్రాహాము మోషేలాంటి మహా భక్తులు కోరినట్లుగా చేసాడని పూర్వవేదం చెప్తుంది. ఈ భక్తులు దేవుని చిత్తప్రకారం జీవించారు. కనుక అతడుకూడ వాళ్లు చెప్పినట్లు చేసాడు. క్రీస్తుకూడ తండ్రి చిత్తప్రకారం జీవించాడు కనుక, తండ్రి అతడు కోరినట్లు చేసాడు అనుకోవాలి. సుతుడు ఎల్లప్పడు తండ్రికి ప్రీతి కచిగించే పనులు మాత్రమే చేసేవాడు8,29. కనుకనే జనకుడు అతనికి విధేయుడై అతనికి ప్రీతి కలిగించే పనులు చేసాడు.

4. పితసుతులకు ఒకరికొకరు తెలుసు

నన్ను నా తండ్రి యెరిగినట్లుగా నేనూ నా తండ్రిని ఎరుగుదును అన్నాడు ప్రభువు - 10,15. వాళ్లిద్దరికి పరస్పర జ్ఞానం వుంది. మనకుకూడ తండ్రీకుమారులు కొంతవరకు తెలుసు. కాని మన ಜ್ಞನಿಂ వేరు. ఆ తండ్రీ కుమారుల పరస్పర జ్ఞానం వేరు. అందుకే సమానాంతర సువిశేషాలు తండ్రి తప్ప ఎవరు కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు అని చెప్తాయి - మత్త 11,27. లూకా 10,22. దైవవ్యక్తులను గూర్చి దైవవ్యక్తులకే తెలుసుకాని నరమాత్రులమైన మనకేమి తెలుస్తుoది?

5. పితసుతులు ఒకరినొకరు మహిమపరచుకొంటారు.

క్రీస్తు “తండ్రీ! గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమ పరచడానికి నీవు నీ కుమారుని మహిమ పరచు" అని ప్రార్థించాడు - 17, సిలువ మరణమూ ఉత్తానం ద్వారా కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు. ఈ కార్యాల ద్వారానే జనకుడు కూడ సుతుని మహిమపరుస్తాడు.

సమానాంతర సువిశేషాలూ, పౌలూ క్రీస్తు మరణాన్ని అవమానంగాను, ఉత్తానాన్ని మహిమనుగాను వర్ణించారు. కాని యోహాను సువిశేషం క్రీస్తు మరణాన్ని మహిమనుగా వర్ణిస్తుంది. ఎందుకు? దేవుడు ప్రేమస్వరూపుడు కదా! - 1 యోహా 4,8. ఆ ప్రేమకు ప్రబల చిహ్నం క్రీస్తు సిలువమరణం. కనుక క్రీస్తు మరణం మహిమాన్వితమైంది. స్నేహితుల కొరకు ప్రాణాన్ని ధారపోసేవాడికంటె ఎక్కువ ప్రేమగలవాడు ఎవడూలేడు - 15,13.