పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటడానికి నా ప్రవక్తగా నియమించాను" అంటాడు-1,10. ఇక్కడ ప్రజలు ఓభవనంగాను పొలంగాను ఉపమింప బడ్డారు. ప్రభువు ప్రవక్తద్వారా వాళ్ళను ఓయిల్లలాగా పడగొడతాడు. పొలంలోని పైరులాగా పెరికివేస్తాడు. ఇది ప్రభుశిక్ష మల్లా తన ప్రవక్తద్వారానే వాళ్లను ఓయిల్లలాగ కడతాడు. ఓ పొలంలోని పైరులాగ నాటుతాడు. ఇది ప్రభువు సంభావనం. ఐనా ఈ ప్రభువు తన ప్రజలను శిక్షించడానికంటె సంభావించడానికే సంసిద్ధంగా వుంటాడు. అతడు ప్రవక్త యెషయా మఖాన "నేను సియోనులో ఓ పునాదిరాయి వేస్తున్నాను. అది విలువగల మూలరాయి. సాక్ష్యపరాయి. నన్ను విశ్వసించేవాడు భంగపాటు నొందడు" అంటాడు - 28,16. అనగా యావే యెరూషలేములో ఓయిల్లు కట్టబోతున్నాడు. అతడు కట్టే యిల్లు మరేమోకాదు. మెస్సీయాచుటూ కూడే భక్తసమాజం. ఈ యింటికి లేక సమాజానికి మూలరాయి మెస్సీయా. ఈ మెస్సియాను విశ్వసించి అతని సమాజంలో చేరేవాళ్ళకు ముప్పలేదు. ఈ సమాజం యావేపట్ల భయభక్తులతో ప్రవర్తించిన "శేషసమాజం", ఈవిధంగా యావే తన ప్రజలను ఓ భవనంలాగ నిర్మిస్తాడు.

56. కీర్తనకారుడు "ఇల్లకట్టేవాళ్లు నిరాకరించినరాయే మూలరాయి అయింది" అంటాడు - 118,22. మొదట ఈవాక్యం కీర్తనకారునికే అన్వయించింది. అతడు దిక్మూమొక్మూలేని దీనుడు. అన్యులచే నిరాకరింపబడినవాడు. ఐనా ప్రభువు అతన్ని ఆదరించాడు. అందుకే దైవప్రజల సమాజంలో ముఖ్యుడయ్యాడు. ఇది మొదటిభావం. కాని క్రమేణ ఈవాక్యం మెస్సీయాకు అన్వయింపబడింది. యూదులు మెస్సియాను నిరాకరిస్తారు. కానీ యావే అతన్ని ఎన్నుకొని తనసమాజానికి నాయకుణ్ణి చేసాడు. నూతవేదం పై మెస్సీయా ప్రవచనాన్ని ఈ కీర్తనకారుని ప్రవచనాన్ని క్రీస్తుకు అన్వయించి అతడే మన పునాదిరాయి అని బోధిస్తుంది. పేత్రు యెషయా పేర్కొనిన "విలువగలరాయి" క్రీస్తేనంటాడు - 1 పేత్రు 2,7. పౌలుకూడ ఈ ప్రవచనాలను మనస్సులో పెట్టుకొని "క్రీస్తే మన పునాది" అంటాడు- 1 కొ 8, 11. యావే క్రీస్తుని మనకు ఓభవనంగా ప్రసాదించాడు. క్రీస్తేమనయిల్లు, దేవాలయం. క్రీస్తు తన శరీరాలయాన్ని గూర్చే "ఈ యాలయాన్ని పడగొట్టండి, నేను మూడు దినాలల్లో దీన్ని తిరిగి నిర్మిస్తాను." అన్నాడు- యోహా 2,19.

57. ఇక యీక్రీస్తు ఓ భవనాన్ని కడతాడు. అతడు నిర్మించిన భవనం నూత్నవేద సమాజం. తిరుసభ. అతడు పేత్రుతో "పేత్రూ! నీవు రాయివి. ఈరాతిమీద నాసమాజాన్ని నిర్మిస్తాను" అంటాడు - మత్త 16,18. పూర్వవేదంలో యావే తనసమాజాన్ని నిర్మించాడు. అదే యిప్రాయేలు ప్రజ. అలాగే నూత్న వేదంలో క్రీస్తు తన సమాజాన్ని నిర్మిస్తాడు. అదే క్రైస్తవ ప్రజ. యావే పూర్వవేద ప్రజలను అబ్రాహామనే రాతిమీద నిర్మించాడని రబ్బయిలు