పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. మోషే మనం వేసిన ఒట్ట నిలబెట్టుకోవాలి అన్నాడు. కాని క్రీస్తు అసలు ఒట్టు పెట్టుకొనేగూడదు అన్నాడు. శిష్యుడు ఓమారు మాట అంటే దాన్ని పాటించాలి. ఔనంటే ఔను, కాదంటే కాదు అన్నట్లుగా వుండాలి. చిత్తశుద్ధితో జీవించాలి. కనుక అతనికి ఏవాటూ అక్కరలేదు - 5, 34-37.

5. ధర్మశాస్త్రం పగతీర్చుకొమ్మంది. మన కన్ను పోగొట్టినవాని కన్నూ మన పన్నురాలగొట్టినవాని పన్నూ ఎగరగొట్టవచ్చు అంది. కాని ఈ ప్రతీకారచర్యను క్రీస్తు అంగీకరించలేదు. దానికి మారుగా క్షమాగుణం బోధించాడు. కనుక శిష్యుడు కీడుకు కీడు చేసి పగతీర్చుకోగూడదు, ఓర్పుతో పగవాడ్డి క్షమించాలి - 5, 38–42

6. ధర్మశాస్త్రం మిత్రుని ప్రేమించి శత్రువుని ద్వేషించమంది. కాని క్రీస్తు ఇది పద్ధతి కాదు అన్నాడు. శత్రువుని గూడ ప్రేమించాలి అన్నాడు. పరలోకంలోని తండ్రి విశ్వమానవ ప్రేమ చూపేవాడు, సజ్జనులకూ దుర్జనులకూ తన వరాన్నీ సూర్యరశ్మినీ ప్రసాదించేవాడు. ఆ తండ్రి లాగే శిష్యుడుకూడ మంచివాళ్ళనీ చెడ్డవాళ్ళనీ అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి -5, 43-48.

ఈలా హత్య వ్యభిచారం, విడాకులు, ఒట్ల, పగతీర్చుకోవడం, సోదరప్రేమ అనే ఆరంశాల్లోను శిష్యుడు పూర్వవేదపు యూదులు పాటించిన నీతికంటె గొప్ప నీతిని పాటించాలి. వాళ్ళకంటె తాను ఎక్కువ చిత్తశుద్ధితో జీవించగలివుండాలి. ఇది క్రీస్తకోరిన శిష్యధర్మం - మత్త 5,20.

4. చిత్తశుద్ధి

యూదులు ఘనంగా యెంచే ధర్మకార్యాలు మూడున్నాయి. అవి దానమూ, ప్రార్థనా, ఉపవాసమూ, కాని యూదులు వీటిని ప్రజల మెపుకోసం చేయడం మొదలెట్టారు. పదిమంది కంటబడేలా వీధుల్లో ప్రార్ధనాదులు చేయడం వాళ్లకు పరిపాటి ఐపోయింది. కనుక వాళ్ళకు లభించిన ప్రతిఫలం ప్రజల మెప్పేగాని దేవుని మెప్పకాదు. యూదులు ఈ పుణ్యక్రియలను వట్టి డంబాచారాలనుగా మార్చారు. చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించారు. కాని శిష్యులు ఈలా ప్రవర్తించగూడదు, ఏ పుణ్యకార్యం జేసినా మనం దేవుని మెప్పగోరాలి గాని ప్రజల మెప్ప కోరగూడదు. మనం దేవునికి బానిసలంగాదు. అతనికి చాకిరి చేసిపెట్టి కూలిని పుచ్చుకోం. మనం అతనికి పుత్రులం. ఆ తండ్రి మన పుణ్యకార్యాలకు మనలను బహూకరిస్తాడు. కనుక పుణ్యకార్యాలుజేసే శిష్యుడు చిత్తశుద్ధితో ప్రవర్తించి దేవునికి ప్రీతి కలిగించాలి - మత్త 6, 11-18.