పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కార్యాలు చేసాడు. ఎప్పడూ ప్రశాంతంగా నిమ్మళంగా వుండిపోయాడు. మనంగూడ దేవుణ్ణి నమ్మి నిదానంగా పనిజేయాలి, అవసరమైనపుడు విశ్రాంతి తీసికోవాలి. తొందరపాటు పనికిరాదు.

4. ఆధ్యాత్మిక రంగంలోగాని లౌకిక రంగంలోగాని పెరుగుదల నిదానంగా జరుగుతుంది. కనుక పుణ్యార్ధనంలో గూడ నిదానం ప్రధానం, కొద్దిరోజుల్లోనే అర్యశిపులమై పోం, పడుతూ లేసూ వరప్రసాద జీవితంలో నిదానంగా ముందుకు పోతాం. దేవుడు నరుడ్డి నిదానంగా మారుస్తాడు. అతడు నిదానంగా బండి తోలేవాడు.

5. పెరుగుదలలో గొప్ప శక్తివుంది. ఎవరూ దాన్ని ఆపలేరు. మొక్క పెరుగుదలను ఎవరాపుతారు? ఆలాగే దైవరాజ్యంగూడ మన హృదయాల్లోను లోకంలోను నిదానంగా పెరుగుతూనే వుంటుంది. విశ్వాస నేత్రాలతో దాని పెంపుని చూస్తాం.

34. ద్వారపాలకుడు- మార్కు 18, 34-37

1. యజమానుడు రాత్రి ఎప్పుడు తిరిగివస్తాడో తెలియదు. కనుక ద్వారపాలకుడు మెలకువతో వేచివుండాలి. ఆలాగే క్రీస్తు రెండవసారి ఎప్పడు తిరిగివస్తాడో తెలియదు. కనుక క్రైస్తవులు మెలకువతో కాచుకొని వండాలి.

2. ద్వారపాలకుడు నిద్రలో పడిపోయి ప్రమత్తుడు కాకూడదు. ఆలాగే మనం లోక వ్యామోహాల్లో పడిపోయి క్రీస్తు రెండవరాకడను విస్మరించకూడదు. ప్రార్థన. వాక్యపఠనం, సేవ, నిగ్రహం మొదలైన భక్తికృత్యాలతో మెలకువగా వుండాలి.

3. క్రీస్తు లోకాంతంలోనే కాదు, ఇప్పడుకూడ ఎన్నోసార్లు మన హృదయాల్లోకి వేంచేస్తాడు. మన జీవితంలోని శుభాశుభాలు, ముఖ్యసంఘటనలు, మన మరణంకూడ అతని రాకడలే. కనుక మనం వీటినన్నిటినీ పరిశీలిస్తుండాలి.

4. లోకాంతం ఒక సంఘటనంకాదు, ఒక వ్యక్తిని, అనగా క్రీస్తుని కలసికోవడం, అతడే మనకు ఆదీ అంతమూ - దర్శ 22, 13. అతని శత్రువునిలా కాదు, మిత్రునిలా కలసికొంటాం. కనుక తొలినాటి క్రైస్తవుల్లాగ మనంకూడ ప్రేమభావంతో "ప్రభువా! వేంచేసిరా? అంటూ అతనికొరకు వేచివుండాలి - 1 కొరి 16,22.