పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడ మారతాయి. ఇంకా, అద్భుతాల కోసం ఎదురుచూస్తూ, పేదలను ఆదుకొమ్మని చెప్పే లేఖనాలను పట్టించుకోకుండ, సుఖభోగాల్లో మునిగితేలేవాళ్ళకు శిక్ష తప్పదు. కాని దేవునిపై ఆధారపడి జీవించేవాళ్ళకు బహుమతి లభిస్తుంది.

2. ఈ కథలోని ప్రధాన పాత్రలు ఆర్గురు ధనిక సోదరులు. వాళ్ళ లేఖనాలు చెప్పినట్లుగా పేదలను పట్టించుకోక సుఖభోగాల్లో మునిగితేలుతూ శిక్షను పొందారు. పేదసాదలను ఆదరించడం మన ధర్మం,

3. పేదసాదలను ఆదుకొమ్మని మోషే, ప్రవక్తలూ ప్రాచీనకాలంలోనే ధనికులను హెచ్చరించారు. కాని 3000 ఏండ్లు కడచినా పరిస్థితులేమీ మారలేదు. ఇప్పడూ ధనికులు పేదలను పీడించి ఇంకా ధనికులౌతున్నారు. మన తరపున మనం పేదలకు సాయం జేయమని చెప్పే బైబులు బోధలను జాగ్రత్తగా మననం చేసికోవాలి.

4. ధనికుని తప్ప ఏమిటి? అతడు లాజరుకి కీడు చేయలేదుకదా! అక్కరలో వున్నవాణ్ణి ఆదుకోగలిగి కూడ ఆదుకోకపోవడమే అతని తప్ప, చేయగూడనివి చేసినపడేకాదు, చేయవలసినవి చేయనపుడు కూడ పాపమే. తుదితీర్పు సామెత సందేశం ఇదే కదా.

5. ధనికుడు అద్భుతాన్ని కోరాడు. చనిపోయి ఉత్తానమైనవాణ్ణి తన సోదరుల దగ్గరికి పంపమని అబ్రాహాముని వేడాడు. కాని తర్వాత బెతానియా లాజరు ఉత్తానమైతే యూదులు నమ్మారా? అసలు క్రీస్తు ఉత్తానమైతే అతన్ని నమ్మారా? బైబులు బోధలు నమ్మనివాళ్లు అద్భుతాలు కూడ నమ్మరు. వాటి విలువ తక్కువ. ఐనా నేడు మన జనం అద్భుతాలకు ఎగబడుతున్నారు. అద్భుతాలు చూడ్డంకాదు, మన పాపాలకు చిత్త శుద్ధితో పశ్చాత్తాపపడ్డం ముఖ్యం.

6. ఈ సామెత ధనికులకు ఉపయోగపడుతుంది. కాని పేదలకేలా ఉపయోగ పడుతుంది? దరిద్రులు కొన్ని విషయాల్లో ధనికులే. వాళ్ళకు విద్య, స్నేహితులు, మంచి ఆరోగ్యం ఉండవచ్చు. ఇవిలేక బాధపడేవాళ్ళు లేరా? పేదలకు కూడ ఎవరో 'లాజర్లు" తగులుతూనే వుంటారు. వాళ్ళ వారిని పట్టించుకోవాలి.

7. పేదలకు ధనికులు అవసరం. కాని ధనికులకు కూడ పేదలు అవసరం. ఏలాగ? పేదవాడికి ప్రేమతో సహాయం చేసినపుడు సంపన్నుని జీవితం సార్థకమౌతుంది అతనిలోని స్వార్థం నశించి ఆధ్యాత్మిక మానవుడు వికసిస్తాడు. సోదరప్రేమద్వారా అతనికి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ పద్ధతిలో పేదలు ధనికులను నిజంగా ధనికులను చేస్తారు.

31. వితంతువు న్యాయాధిపతి - లూకా 18, 1-8.

1. అధార్మికుడైన న్యాయాధిపతి చాలకాలం వితంతువు మనవిని పట్టించుకోలేదు. కాని ఆమె పదేపదే విన్నవించుకోవడంవలన కడన ఆమె మనవిని విన్నాడు. ఐతే కరుణగల