పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చాత్తాపపడతాం. దేవునిపట్ల ప్రేమవలన కాదు. ఇది అసంపూర్ణ పశ్చాత్తాపం, ఐనా మన రక్షణకు ఇది చాలు. దేవునికి మన బలహీనతలు తెలుసు.

8. చిన్నవాడు తండ్రి వద్దకు తిరిగివచ్చాడు. పాపం తండ్రి నుండి వెళ్ళిపోవడమైతే, పశ్చాత్తాపం ఆ తండ్రి చెంతకు తిరిగిరావడం.

9. తండ్రి చిన్నవాడి తప్పను మన్నించినా పెద్ద కుమారుడు తమ్ముని తప్పను మన్నించలేదు. దేవుడు తన ఎండనూ వాననూ మంచివాళ్ళకూ చెడ్డవాళ్ళకూ సమానంగా ఇస్తాడు - మత్త 5,45. దేవునికి శత్రువులుండరు, అందరూ అతని బిడ్డలు. పాపులపట్ల అతని కరుణ అంత గొప్పది. కనుక మనం ఇతరుల తప్పలను అతిగా విమర్శించకూడదు.

29. యుక్తిగల గృహనిర్వాహకుడు - లూకా 16,1-13

1. గృహనిర్వాహకుడు ఉద్యోగాన్ని పోగొట్టుకోవలసి వచ్చినపుడు తెలివితోను త్వరగాను కార్యం నడిపి లాభాన్ని పొందాడు. ఆలాగే దేవుని తీర్పు సమీపిస్తున్నపుడు మనంకూడ తెలివితోను శీఘంగాను పనిచేసి ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలి.

2. ఈ కథ దుర్మార్ణుని గూర్చి క్రీస్తు దుష్టులను గూర్చికూడ సామెతలు చెప్పాడు. నరుల బలహీనతలు అతనికి బాగా తెలుసు - యోహా 2,25, అతడు పాపులను అసహ్యించుకోడు. వారిని రక్షించడానికి వచ్చాడు.

3. ఈ కథలోని ఉద్యోగి తన ఉద్యోగం ఊడిపోతున్నపుడు త్వరగా కార్యానికి పూనుకొని లబ్దిని పొందాడు. అతని గొప్పతనం అది. ఆధ్యాత్మిక విషయాల్లో మనం కూడ త్వరగా పనికి పూనుకోవాలి. జాప్యం చేస్తే ఇప్పడు మనలను ప్రేరేపించిన వరప్రసాదం నిలవకపోవచ్చు

4. నరులు ఈలోక విషయాల్లో చాల శ్రద్ధ తెలివి చూపిస్తారు. కాని పరలోక విషయాల్లో ఈ శ్రద్ధ చూపించరు. ఇది మనందరి బలహీనతే - 8,

5. ధనానికి హృదయాన్ని అర్పించుకొన్నవాడు దేవుణ్ణి సేవించడు. డబ్బు మంచిదే. కాని అదే మనకు దేవుడు కాకూడదు - 13.

6. దైవరాజ్యంతో పోలిస్తే ధనం అల్పవస్తువే. కాని దాన్ని వాడే తీరులోనే మన శీలం తెలిసిపోతుంది. అల్ప వస్తువైన ధనాన్ని నిజాయితీతో వినియోగించేవాడు ముఖ్యవస్తువైన దైవరాజ్యాన్ని సంపాదిస్తాడు. మనం మోక్షానికి పోతామా లేదా అన్నది మనం వాడుకొనే జపపుస్తకం గాదు, బ్యాంకు పుస్తకం నిర్ణయిస్తుంది- 10,11.

30. ధనికుడూ లాజరూ - లూకా 16,19-31.

1. పేద లాజరూ, లేఖనాల బోధలను పట్టించుకోని ధనికుడూ చనిపోయాక స్థితిగతులు తారుమారయ్యాయి. ఈలాగే మనం చనిపోయాక మన పరిస్థితులు