పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ఇతరులను మనకంటె యోగ్యులనగా గణించాలి అన్నాడు పౌలు- ఫిలి 2,8, ఇది వినయం, మామూలుగా మనం అన్యులను మనకంటె హీనులనుగా గణిస్తాం. ఇది పొగరు,

22. పొలంలోని యిల్లు, యుద్ధము - లూకా 14,28-83

1. శక్తి వుంటేనే గాని ఒక కార్యానికి పూనుకోగూడదు. అలాగే నిరంతరం తనకున్నవి వదలుకొంటూంటేగాని క్రీస్తుని అనుసరించలేం. ఇది యిక్కడ ఉపమానం.

2. ఇద్దరు యజమానులను సేవించకూడదు. క్రీస్తు శిష్యుడయ్యాక మళ్ళా లోక సుఖాల వెంట పోకూడదు. నిరంతం స్వార్ణత్యాగంతో జీవించాలి. పని ప్రారంభించి మధ్యలో వదలివేసినవాణ్ణి లోకం మెచ్చుకోదు. అలాగే కొంతకాలం క్రీస్తుని అనుసరించి మళ్లా లోక వ్యామోహాల్లో పడిపోతే ఎవరు మెచ్చుకొంటారు? నాగటి విూద చేయిపెట్టి మళ్ళా వెనక్కిచూడకూడదు - లూకా 9,62,

3. పిశాచం మన హృదయం లోక వస్తువుల మీదికి పోయేలా చేస్తుంది. ఇక దేవునిమీద ఆసక్తి పోతుంది, కనుక నిరంతరం మన మమకారాలను అణచుకొని మనసును దేవునివైపు త్రిప్పకొంటూండాలి.

4. లోక వస్తువులు చెడ్డవికాదు, మంచివే. కాని వాటికంటె క్రీస్తు అధికుడు. కనుక లోక వస్తువులు క్రీస్తుని చేరడానికి సాధనాలు కావాలికాని, ఆటంకాలు కాకూడదు.

23. అవివేకియైన ధనికుడు -లూకా 12, 13-21.

1. దేవునితో సంబంధం లేకుండ ధనికుడు సుఖజీవనానికి పథకాలు వేసికొంటే అతని ఆకస్మిక మరణం వల్ల అవి భగ్నమయ్యాయి. ఆలాగే మనం దేవునితో సంబంధంలేని పథకాలు వేసికొంటే అవి ఫలించవు. మన సంపదలు మనకు ఆయుస్సు నీయలేవు.

2. ఈ కథలో తమ్ముడు అన్ననుండి ఆస్తిలో తన భాగాన్ని రాబట్టుకోగోరాడు. అదీ తనకనుకూలంగాను, క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారాను. తన స్వార్థం ముఖ్యం .మన ప్రార్థనలో మన చిత్తంకాదు, దేవుని చిత్తం నెరవేరాలని కోరుకోవాలి.

3. క్రీస్తు ఈ కథలోని తమ్మునితో దురాశను అణచుకొమ్మని చెప్పాడు. ఆశకు లొంగితే లోక సంపదలే దేవుడౌతాయి. ఇక దేవుణ్ణి పట్టించుకోం. 4. ఈ కథలోని ధనికుడు తన సంపదలతో హాయిగా జీవిస్తాననుకొన్నాడు, కాని అకాలమృత్యువు వాతపడ్డాడు. సంపదలు ఆయుస్సుని ఈయలేవు. జీవాన్నిచ్చేది దేవుడొక్కడే. కనుక అతని ప్రమేయంలేని పథకాలు చెల్లవు,

5. ఈ ధనికుడు అవివేకి, అనగా దేవుణ్ణి పట్టించుకోనివాడు. అతడు సంపదలతోనే అన్నీ చేకూరుతాయి అనుకొన్నాడు. కాలమూ, భవిష్యతూ మన ఆధీనంలో వుంటాయనుకొన్నాడు. కాని దేవుడు చావుని ఎప్పుడైనా పంపవచ్చు, ధనికుడు అది