పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఈ కథలోని యజమానుడు కొంతకాలం పాటు కనుమరుగై ప్రధాన సేవకులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. నేడు క్రీస్తు గాని, తిరుసభ గాని మన జీవితంలోని ప్రతి విషయంలోను జోక్యం చేసికోరు. చాల విషయాల్లో మనకు స్వేచ్ఛ వుంటుంది. బైబులు ప్రతివిషయంలోను ఆజ్ఞలు విధించదు. కాని మనం తగిన నిర్ణయాలు చేసికొని, ఉచితరీతిని ప్రవర్తించాలి. దేవుని సేవించడం పరిపాలనం చేయడంతో సమానం, అనగా మనం స్వేచ్చగా ప్రవర్తిస్తామని భావం.

4. ఈ సామెత లోని ముఖ్య సేవకుడు ఇతర సేవకుల విూద అధికారి. ఐతే క్రైస్తవ సమాజంలో అధికారిగా వుండడమంటే నిరంకుశంగా పెత్తనం చలాయించడం గాదు. తోడివారికి సేవలు చేయడం - మార్కు 10,42-45. ఈ కథలోని సేవకుడు అలాంటివాడు. అతడు తన లాభం చూచుకోక ఇతరుల మేలెంచాడు. మన పెద్దలు ఈలాగుండాలి.

5. తోడివారి విూద పెత్తనం చలాయించి వారిని బాధించేవారిని క్రీస్తు దండిస్తాడు. అతడు పీడితుల కోప తీసికొనేవాడు. కనుక అధికారులు పరపీడనానికి గాక పరుల సేవకు పూనుకోవాలి.

19. మూసిన ద్వారం - లూకా 18,22-30

1. ఇంటి యజమానుడు తలుపులు మూసివేసి అన్యులను లోనికి రానీయడు. అలాగే క్రీస్తు అంత్యకాలంలో దైవరాజ్యపు తలుపులు మూసివేసి దుషులను కోనిక్రి రానీయడు.

2. పూర్వం చాలమంది, రక్షణం పొందేవాళు కొద్ది మందేనేమోనని భయపడేవాళ్ళు ఇప్పడు చాలమందికి అసలు నరకభీతే లేదు. కొందరు నరకమే లేదనీ, ఉన్నా అది శాశ్వతం కాదనీ భావిస్తున్నారు. ఇక్కడ క్రీస్తు దుషులకు దైవరాజ్య ప్రాప్తి లేదని రూఢిగా చెప్తున్నాడు. కనుక పాపభీతితో జీవిద్దాం.

3. రక్షణం పొందేవాళ్ళకొద్దిమందేనా అని అడగ్గా క్రీస్తు ఔననలేదు, కాదనలేదు. ఔనంటే మనకు నిరుత్సాహం కలుగుతుంది. కాదంటే ఆధ్యాత్మిక జీవితాన్ని చులకన చేస్తాం. క్రీస్తు శ్రమపడి ఇరుకైన ద్వారం గుండ దైవరాజ్యంలో ప్రవేశించబడి అన్నాడు24. ఎంతమంది రక్షణం పొందుతారు అన్నది ముఖ్యం కాదు. రక్షణాన్ని పొందడానికి మనమెంతగా శ్రమపడుతున్నాం అన్నది ముఖ్యం. కావున మన పాపాలకు పశ్చాత్తాపపడి దేవుని చిత్తప్రకారం జీవించాలి,

4. దైవరాజ్య ద్వారం ఇరుకైనది. మనం దాని గుండా ప్రవేశించాలి. అనగా సువిశేష నియమాలు ఖండితంగా పాటించాలి. స్వార్గాన్ని అణచుకోవాలి. శ్రమలు అనుభవించాలి. విచ్చలవిడిగా జీవిస్తే కుదరదు.