పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. పూర్వం మహా సేవకులు దేవుణ్ణి ప్రేమించి అతనికి గొప్ప సేవలు చేసారు. అబ్రాహాము, మోషే, యేలీయా, దావీదు, పౌలు, డోమినిక్, ఫ్రాన్సిస్ జేవియర్, మదర్ తెరీసా ఈలాంటివాళ్ళు ఈ భక్తులు మనకు ఆదర్శం కావాలి.

6. మూడవ సేవకుడు డబ్బును వృద్ధి చేయని సోమరి. పైగా యజమానుణ్ణి తప్పపట్టాడు. మనం దైవ రాజ్యాన్ని వ్యాప్తి చేయని సోమరులం. పైగా మనలను మనం సమర్ధించుకొంటూ దేవునిపై నిందలు మోపుతాం.

7. ఐదు లక్షలు పెంచినవాడికీ, రెండు లక్షలు పెంచినవాడికీ కూడ యజమానుడు అదే బహుమతి యిచ్చాడు. ఇంకొకరితో పోల్చుకోకుండా మన శక్తి కొలది మనం పనిజేస్తే చాలు, దేవుడు మెచ్చుకొంటాడు. దేవుడు మనం ఎంత సాధించామా అని చూడడు. ఎంత ఆసక్తితో, ఎంత ప్రేమభావంతో సేవ చేసామా అనిచూస్తాడు.

16. తుది తీర్పు - మత్త 25,81-46

1. కాపరి రాత్రి గొర్రెలనూ, మేకలనూ వేరుపరుస్తాడు. అలాగే క్రీస్తు న్యాయ నిర్ణయ దివాన అక్కరలో వున్నవారిని ఆదుకొన్నారా లేదా అన్నదాన్ని బట్టి నరులను వేరుపరుస్తాడు.

2. ఈ కథ తుదితీర్పును గూర్చి, మనం పాపపుణ్యాలను లెక్కచేయం, న్యాయనిర్ణయ దినాన్ని పట్టించుకోం. విచ్చలవిడిగా తిరుగుతాం. దేవుడు న్యాయవంతుడైతే మన పాపపుణ్యాలకు తీర్పు విధించితీరుతాడు. కనుక దైవభీతితో జీవించాలి.

3. చాలామంది దేవుణ్ణి చూడాలని కోరుకుంటారు. దైవదర్శనం కొరకు దూరప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. అతడు మన మధ్యలోనే మారువేషంలో సంచరిస్తుంటాడు. అతడు పేదసాదల్లో, ఆర్తుల్లో దర్శనమిస్తాడు. కనుక వారిని ఆదుకొంటే అతన్ని ఆదుకొన్నట్లే, క్రీస్తు బాధార్తులను ఆదుకొమ్మని చెప్పిన సూక్తులన్నింటిలో ఈ సామెత అతి బలీయమైంది.

4. బైబుల్లో దేవుడు తన్ను గూర్చి తాను పట్టించుకొన్నదాని కంటె నరులను గూర్చి ఎక్కువగా పట్టించుకొంటాడు. విశేషంగా ఆపదల్లో అక్కరల్లో వున్న నరులంటే అతనికి ప్రీతి. ఈ దీనులను క్రీస్తు ఇక్కడ "నా సోదరులు" అని పేర్కొన్నాడు. కనుక మనం వీరిని తప్పక పట్టించుకోవాలి.

5. ఈ కథలో వచ్చే సహాయాలన్నీ భౌతిక వస్తువులను ఈయడమే. ఆకలిదప్పులు తీర్చడం, ఇల్లు బట్టలు మందులు ఈయడం, పరామర్శించడం మొదలైనవి. ఇండియా లాంటి పేదదేశంలో ఈ సహాయాలు ఎప్పడూ అవసరమే. పైగా ఇవన్నీ చిన్నచిన్న కార్యాలు. ఎవరైనా చేయవచ్చు. కనుక మనం ఈ పనులు తప్పక చేయాలి.