పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరుని యింటికి తీసికొని పోవడం వాళ్ళపూచీ, నూనె లేకపోతే వాళ్ళ తమ ముఖ్యకార్యాన్ని నిర్వర్తించలేరు. అవివేకవతులైన కన్నెలు ఈ ముఖ్య వస్తువునే మర్చిపోయారు. అది వాళ్ళలోపం. క్రైస్తవ జీవితంలో ప్రేమ, విశ్వాసం, నిరీక్షణం, ముఖ్యమైనవి. ఇవి లేందే మనకు రక్షణం లేదు.

3. అర్ధరాత్రిలో ఇదిగో పెండ్లికుమారుడు! ఇతనికి స్వాగతం చెప్పడానికి రండి అనే కేక వినిపించింది. ప్రభువు రెండవమారు వేంచేసి రావడం తథ్యం. కాని అతడు ఎప్పడు వస్తాడో తెలియదు. కనుక మన తరపున మనం ఎప్పడూ ఓపికతో, భక్తితో వేచివుండవలసిందే.

15. ముగ్గురు సేవకులు - మత్త 25, 14-30

1. క్రీస్తు ఈ సామెత చెప్పినపుడు అతని ఉద్దేశం ఇది. యజమానుడు తన సొమ్ముని వృద్ధి చేసిన సేవలకును బహూకరించి వృద్ధి చేయని సేవకుని దండించాడు. అలాగే దేవుడు తన వాక్యాన్ని (ధర్మశాస్తాన్ని) ఇతరులకు బోధించే యూద నాయకులను బహూకరించి అలా చేయని నాయకులను దండిస్తాడు.

ఇక ముత్తయి ఈ సామెతను లిఖించినపుడు అతని భావం ఇది. యజమానుడు తన సొమ్మను వృద్ధి చేసిన వారికి బహూమానము, అలా చేయని వారికి శిక్షా విధించాడు. అలాగే రెండవసారి విజయం చేసే క్రీస్తు తానిచ్చిన ఆధ్యాత్మిక వరాలను వాడుకొని వృద్ధి చేసికొన్నవాళ్ళను బహూకరిస్తాడు. అలా చేయనివాళ్ళను శిక్షిస్తాడు.

2. పూర్వం యూద నాయకులు యూదులకు అన్య జాతులకూ ధర్మశాస్రాన్ని శ్రద్ధతో బోధించలేదు. అలాగే ఇప్పడు తిరుసభ అధికారులు క్రైస్తవులకూ అన్యులకూ సువిశేష సందేశాన్ని విన్పించడంలో అశ్రద్ధ చేస్తున్నారు.

3. యజమానుడు సేవకులను నమ్మి వారికి తమ ధనాన్ని అప్పగించాడు. క్రీస్తు మనలను నమ్మి దైవరాజ్య విస్తరణ పూచీని మనకు అప్పగించాడు. మనం విశ్వసనీయులంగా ఈ కార్యాన్ని నిర్వర్తించాలి.

4. యజమానుడు సేవకులకు స్వేచ్చ నిచ్చాడు. వాళ్లు డబ్బును తమ యిష్టం వచ్చినట్లుగా వినియోగించి దాన్ని వృద్ధి చేయాలి. అలాగే దేవసేవలో మనకు స్వేచ్ఛ వుంది. ఎవరి శక్తికీ అభిరుచికీ తగ్గట్టుగా వాళ్ళు పని చేయవచ్చు. అందరూ ఒకే రకమైన పని చేయనక్కరలేదు. ఒక్కొక్కరి శక్తిలో తేడా వుంటుంది కూడ. అందుకే యజమానుడు ఎవరి శక్తికి తగ్గట్టుగా వారికి ధనమిచ్చాడు - 15. ఇక, దేవుడు మనకిచ్చిన ధనం మన శక్తిసామర్థ్యాలే. వీటిని దైవ సేవకు వాడాలి. ఐతే, మన శక్తికి తగ్గట్టుగా మనం పనిచేస్తే చాలు.