పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలాగే న్యాయనిర్ణయ దినందాక దుషులను గూడ మంచివారితో కలసి జీవించనీయాలి. ఇక, మత్తయి ఈ సామెతను లిఖించినపుడు అతని భావం ఇది. కోతకాలంలో మొదట కలుపు మొక్కలను వేరుజేసి కాల్చివేస్తారు, అలాగే న్యాయనిర్ణయ దినాన మొదట ଔର୍ତ୍ତ సమాజంలోని దుషులను మంచివారి నుండి వేరేజేసి శిక్షకు గురి చేస్తారు.

2. ఈ సామెత లోని పొలంలో కలుపూ, గోదుమా కలసి పెరుగుతున్నాయి. లోకంలో ఎప్పుడూ మంచీచెడ్డా కలసి ఉంటాయి. స్వచ్ఛమైన నీరు ఎక్కడా దొరకదు. మనం మంచివాళ్ళం అనుకొన్నపుడు గూడ మనలో ఎంత దుష్టత్వం ఉండదు? మనం చెడ్డవాళ్ళు అనుకొనేవాళ్ళల్లో గూడ ఎంత మంచితనం ఉండదు? దేవుడు నరులందరికీ కొంతకాలం పాటు పరివర్తనావకాశం దయచేస్తాడు, పైరులోని ప్రతి మొక్క బాగా ఉండాలని అతని కోరిక

3. ఈ సామెత పేర్కొనే పొలం మన హృదయం కూడ. దానిలో కలుపూ గోదుమా రెండూ పెరుగుతూంటాయి. దుష్టత్వమూ మంచితనమూ రెండూ వృద్ధిజెందుతూంటాయి. దైవరాజ్యం పిశాచ రాజ్యం రెండూ వ్యాపిస్తుంటాయి. కాని మన తరపున మనం మన హృదయంలోని కలుపును పెరికి వేసుకొంటూండాలి.

4. కలుపును గోదుమ నుండి వేరుచేద్దాం, దుషులను మంచివారి నుండి తొలగిద్దాం అనే తహతహ పనికి రాదు. ఈ దుష్టులు కూడ తర్వాత పరివర్తనం చెందవచ్చు కదా! క్రీస్తును అభిషేకించిన మరియ, అగస్టీను మొదలైన భక్తులు మొదట పాపులేకదా! కనుక పాపులను తొలగిస్తే పరివర్తనం చెందేవారిని గూడ పెల్లగించినట్లవుతుంది. ఇంకా, తిరుసభలోని జనమంతా మంచివాళ్ళే ఐతే, మనలాంటి పాపులకు అసలు దానిలో స్థానముంటుందా?

5. పరిసయులు యూద సమాజం నుండి పాపులను తొలగించాలనుకొన్నారు. పవిత్రులకు మాత్రమే దానిలో స్థానముండాలి అనుకొన్నారు. కాని క్రీస్తు ఈలా భావించలేదు. అతడు పాపుల పరివర్తనాన్ని కోరాడు. నేను రోగుల కొరకు వచ్చిన వైద్యుణ్ణి అన్నాడు - మత్త9,12, పాపులను ఎంతో కరుణతో ఆదరించాడు. కనుక మనం పాపుల పట్ల కటువుగా గాక మృదువుగా ప్రవర్తించాలి. పాపలను సంస్కరించాలి అనే భావం మితిమిూరి పోకూడదు. దేవుడే పాపులను సహిస్తున్నాడు కదా! మరి మనం అసహనం చూపితే ఏలా? అతడు యిస్రాయేలు పాపాలనూ, తిరుసభ పాపాలనూ సహించాడు. మన సొంత పాపాలను గూడ సహిస్తున్నాడు. కనుక ఇతరుల తప్పిదాలను చూచి మనం సహనం కోల్పోగూడదు.

6. ఈ సామెతలో ముఖ్యమైంది కలుపుగాదు, గోదుమ. అది పండింది. లోకంలో బలమైందీ, విజయాన్ని సాధించేదీ పిశాచ రాజ్యం గాదు, క్రీస్తు రాజ్యం. క్రీస్తు అల్ఫా, ఓమెగా - ఆది, అంతం. అన్నిటికీ ఆధారం, అన్నిటినీ విజయవంతం చేసేవాడు- దర్శ 22,13. మనం ఈ యూశాభావంతో జీవించాలి.