పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక మత్తయి ఈ సామెతను లిఖించినపుడు అతని ఉద్దేశం ఇది. నాలు రకాల నేలలు నాలుగు రకాల ఫలితాన్నిచ్చాయి. అలాగే దైవవాక్యాన్ని వినేవాళ్ళ మనస్తత్వాలను ಐಜ್ಜಿ ఫలితాలు భిన్నంగా ఉంటాయి.

2. ఈ కథలోని రైతుకి మూడు రకాల నేలలు ఫలింపలేదు. నాల్గవ రకం నేల మాత్రం పండింది. ఈలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో గూడ చాలసార్లు అపజయం పొందుతాం. కాని కడన విజయం లభిస్తుంది. దైవకృప వల్ల ఈ విజయం సిద్ధిస్తుంది - రోమా 521. కనుక మన తరపున మనకు ఆశావాదం అవసరం.

3. ఈ కథ చెప్పిన క్రీస్తులోని ఆశావాదాన్ని కూడ మననం జేసికోవాలి. అతనికి నరుల బలహీనతలు తెలుసు - యోహా 2,24-25. వారి హృదయాలు దుష్టమైనవనీ తెలుసు-మార్కు 7,21-22. ఐనా అతడు శిష్యులను నమ్మి వారివిూద ఆధారపడ్డాడు. తర్వాత వాళ్ళు దైవరాజ్యాన్ని వ్యాప్తి చేసారు. దైవశక్తి వాళ్ళను బలపరచింది -1 కొరి 3,6. ఆ దివ్యశక్తి నేడు మనకు కూడ తోడుగా ఉంటుంది. కనుక మనమెప్పడూ ఆశావాదులంగా మెలగాలి.

4. ఈ కథలో మొదటి మూడు రకాల నేలలు, లేక మొదటి మూడు వర్గాల ప్రజలు ఫలితాన్ని ఈయలేదు. వారిలో తొలివర్గం ప్రజలు వాక్యాన్ని విని కూడ గ్రహించలేదు - 19. ఎందుకు? వీరి హృదయం నైతికంగా సిద్ధంగా లేదు. వీళ్ళు తమ దుష్టవర్తనాన్ని సవరించుకోవడానికి గాని, క్రీస్తుని అంగీకరించడానికి గాని తయారుగా లేరు. ఈలాంటి వాళ్ళ విూద దైవ వాక్యం పనిచేయదు.

5. రెండవ రకం నరులు నేలలోనికి వేరుపాతుకోని మొక్కల్లాంటి వాళ్లు-21. ఈలాంటివాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలనూ, శ్రమలకూ తట్టుకోలేక ఎండిపోతారు. గట్టి విశ్వాసం లేని క్రైస్తవులు నిలువరు. భక్తుడు క్రీస్తులోకి లోతుగా వేరుపాతుకోవాలి.

6. మూడవ వర్గంవాళ్ళకు లోక వ్యామోహాలు ధనాశ మెండు. కాని మన సంపద క్రీస్తే, ఆ సొత్తును గాక మరో సౌత్తును ఆశించేవాడు గట్టెక్కడు.

7. విత్తనానికి కొదవలేదు. బైబులు గ్రంథమంతా విత్తనమే. విత్తనాన్ని వెదజల్లే బోధకులకూ కొదువలేదు. చాలమంది కాకపోయినా కొంతమంది బోధకులు ఉన్నారు కదా! మరి దేనికి కొదవ? మంచి నేలకు. నాల్లనేలల్లో ఒక్క నేల మాత్రమే ఫలించింది. మన హృదయం ఈ మంచి నేలలాగ ఉంటుందా? దైవవాక్యమనే విత్తనం మన హృదయంలో పడి ఫలిస్తుందా?

5. గోదుమ, కలుపు 13,24–80, 86–48

1. క్రీస్తు ఈ వుపమానాన్ని చెప్పినపుడు అతని భావం ఇది. పైరు కలుపు కలసివున్న పొలంలో కలుపును పీకివేయకూడదు. పీకివేస్తే పైరు కూడ పెల్లగిల్లుతుంది.