పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొమ్మల్లో ఆశ్రయం పొందుతారు. వీళ్ళ మనలను చూచి భక్తిని అలవరచుకొంటారు. ఇక, మన తరపున మనంకూడ పునీతులనే చెట్ల కొమ్మల్లో ఆశ్రయం పొందాలి.

3. పులిపిడి ద్రవ్యం - 13,38.

1. పులిపిడి ద్రవ్యం రొట్టెల పిండితో కలసినపుడు ఆ పిండిలో మార్పు తెస్తుంది. అది పలిసి పొంగేలా చేస్తుంది. అలాగే దైవరాజ్యం లోకంలోకి ప్రవేశించినపుడు ఆ లోకంలో మార్పు తెస్తుంది. నరుల హృదయాలు మారేలా చేస్తుంది. క్రీస్తు సందేశం ఎప్పడూ నరుల హృదయాలను కదిలిస్తుంది. ప్రజలు అతన్ని అంగీకరించైనా అంగీకరిస్తారు, లేక నిరాకరించనైనా నిరాకరిస్తారు. క్రీస్తు సందేశాన్ని అంగీకరింపని వాళ్ళ కూడ అతని వల్ల కొంతవరకు ప్రభావితులౌతారు. కనుక మార్పు ఈ కథలో ముఖ్యాంశం.

2. పులిపిడి ద్రవ్యాన్ని ఏ కప్పలోనో పెట్టి ఓ మూలన వంచితే అది యేమిూ చేయదు. దాన్ని పిండిలో కలపాలి. అప్పడే ఆ పిండి పలిసి పొంగేది. అలాగే క్రీస్తు బోధలను బైబుల్లోనే వుంచితే చాలదు. వాటిని ప్రజలకు ప్రకటించాలి. క్రీస్తు జీవితాన్ని తెలిసికొని అతని సందేశాన్ని విన్నపుడు ప్రజల హృదయాలు మారతాయి. కనుక మన తరపున మనం భక్తితో జీవిస్తేనే చాలదు. బోధకులుగా గూడ మెలగాలి.

3. పులిపిడి ద్రవ్యం కలియకపోతే పిండి పులియదు, పొంగదు, రొట్టెకాదు. దాని తరపున అది మద్దగా ఉండిపోతుంది. అలాగే క్రీస్తు శక్తి సోకకపోతే మన హృదయాలు మారవు. నేను లేక మిూరేమి చేయలేరు అన్నాడు ప్రభువు - యోహా 15,5.

4. పరిమాణంలో పులిపిడి ద్రవ్యం చిన్నది. పిండి పెద్దది. ఐనా చిన్నదైన పులిపిడి ద్రవ్యం అంతర్గత శక్తితో తనకంటె పెద్దదైన పిండిని లొంగదీసికొంటుంది. మనదేశంలో క్రైస్తవులు అల్ప సంఖ్యాకులు. అన్య మతస్తులు అధిక సంఖ్యాకులు. ఇంకా దేశంలో దేవుణ్ణి పట్టించుకోనివాళ్ళ నాస్తికులు కూడ వున్నారు. ఐనా క్రీస్తు శక్తితో అల్ప సంఖ్యాకులైన క్రైస్తవులే అధిక సంఖ్యాకుల హృదయాలను మార్చివేయగలరు. కనుక మనం మైనారిటీ వర్గానిమి అనే భయం అక్కరలేదు. క్రీస్తు బలం మనకు చాలు. మిూరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను. అన్నాడు ప్రభువు- యోహా 16,33.

4. విత్తేవాడు - 13,1-9, 18-23

1. ఈ వుపమానంలో రెండంశాలు గుర్తించాలి. క్రీస్తు మొదట ఈ సామెతను చెప్పినపుడు అతని వద్దేశం ఇది. రైతుకి పంటను చేకూర్చుకోవడంలో మొదట చాల ఆటంకాలు ఎదురయ్యాయి. మూడు రకాల నేలలు పండలేదు. కాని కడన ఫలితం దక్కింది. అలాగే దైవ రాజ్య స్థాపనలో క్రీస్తుకి మొదట చాల ఆటంకాలు ఎదురయ్యాయి. కాని కడన విజయం లభించింది.