పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. మనకున్నది దైవరాజ్యం కొరకు త్యాగం చేస్తే దేవుడు మనకు అధికంగానే యిస్తాడు. అతని ఔదార్యం గొప్పది- మార్కు 10,29-30.

2. ఆవగింజ- 13,31-32

1. ఆవగింజ చాల చిన్నది. ఐనా అది పెద్ద మొక్కగా పెరుగుతుంది. అలాగే దైవరాజ్యం మొదట చాల చిన్నది. అది మొదటలో క్రీస్తు, అతని శిష్యులు మాత్రమే. ఐనా అది మహారాజ్యంగా విస్తరిల్లి లోకంలోని నరులందరికీ ఆశ్రయమిస్తుంది. పెరుగుదల ఇక్కడ ముఖ్యాంశం.

క్రీస్తుకి తన జీవిత కాలంలో గుర్తింపు లేదు. అతని శిష్యులు అనామకులు. ఐనా ఈ చిన్న బృందం ప్రారంభించిన దైవ రాజ్యం 300 ఏండ్లల్లోనే మహా శక్తిమంతమైన రోమను సామ్రాజ్యాన్ని లొంగదీసికొంది. ఆ పిమ్మట ప్రపంచమంతటా వ్యాపించింది. ఇంకా, క్రైస్తవ మతంలో చేరకపోయినా క్రీస్తు రాజ్యానికి చెందిన భక్తులు ఇతర మతాల్లో కూడ వున్నారు. వీళ్ళతో కలుపుకొంటే దైవరాజ్యం ఇంకా పెద్దది. క్రీస్తు రాజ్యం ప్రారంభంలో చిన్నది, అంతంలో గొప్పది.

2. దేవుని కార్యాలు కూడ ప్రారంభంలో చిన్నవి. కాని అవి తర్వాత కొండంతలుగా పెరిగిపోయాయి. అబ్రాహాము సారాలకు జన్మించిన ఈసాకు నుండి యిస్రాయేలు మహాజాతి ఆవిర్భవించింది. సమూవేలు నుండి అభిషేకం పొందిన దావీదు యువకుని నుండి యిస్రాయేలు రాజ్యం పుట్టింది. పండైండు మంది బెస్తల నుండి పుట్టుక వచ్చిన చిన్న తిరుసభే ఖండాంతరాల వరకు వ్యాపించింది. మన కాలంలోనే మదర్ తెరీసా ఉద్యమం చిన్నకార్యాలతోనే ప్రారంభమై విశ్వమంతటా వ్యాపించింది కదా! కనుక మనం కూడ మొదటలో చిన్నవిగా కన్పించే మంచి కార్యాలను ప్రారంభించడానికి వెనుకాడకూడదు, దేవుని దీవెన వల్ల అవే తర్వాత మహాకార్యాలు కావచ్చు. గొప్ప ఉద్యమాలన్నీ మొదటలో చిన్న పనులే కదా!

3. ఆధ్యాత్మిక జీవితంలో కూడ ఈ పెంపు కన్పిస్తుంది. చిన్నబిడ్డలు జ్ఞాన స్నాన సమయంలో విశ్వాసాన్ని స్వీకరిస్తారు. ఈ విశ్వాసం వారిలో క్రమంగా పెరిగి వారిని దైవభక్తులనుగా మార్చివేస్తుంది. చిన్నప్రాయంలోనే చాలమంది దైవభక్తులుగా మరణించారు కూడ. మరియు గొరెట్టి, డోమినిక్ సావియొు, స్టనిస్లాస్, బర్కుమెన్స్ మొదలైనవాళ్ళ ఈలాంటివాళ్ళ వీళ్ళ కొద్ది కాలంలోనే సిద్ధిని పొంది దీర్ఘకాలం జీవించిన వాళ్ళయ్యారు - సాలో జ్ఞాన - 413. మన భక్తి జీవితం గూడ ఈ యావగింజలాగ ప్రారంభమై పెద్ద మొక్కలాగ ఎదగాలి.

4. పాలస్తీనా దేశపు ఆవచెట్టు ఏడడుగుల వరకూ పెరుగుతుంది. పక్షులు దాని కొమ్మలను ఆశ్రయిస్తాయి. మన భక్తి విశ్వాసాలే ఓ చెట్టు అనుకొందాం. మన మంచి ఆదర్శం వల్ల, మన సేవల వల్ల ప్రభావితులైనవాళ్ళ కొందరు వచ్చి ఈ చెట్టు