పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. అవివేకియైన ధనికుడు -241
24. నడిరేయి వచ్చిన స్నేహితుడు -242
25. ఇద్దరు బాకీదారులు -242
26. మంచి సమరయుడు -243
27. తప్పిపోయిన గొర్రె, జారిపోయిన నాణెం -244
28. తప్పిపోయిన కుమారుడు ---245
29. యుక్తిగల గృహనిర్వాహకుడు -246
30. ధనికుడూ లాజరూ -246
31. వితంతువు, న్యాయాధిపతి - 247
32. సుంకరి పరిసయుడు -248

3. మార్కు ఉపమానాలు

33. తనంతట తానే పండిన పంట - 249
34. ద్వారపాలకుడు -250

1. మత్తయి ఉపమానాలు

(ఈ సంచిక క్రీస్తు సామెతల గ్రంథానికి అనుబంధం)

1. నిధీ, ఆణిముత్యం - మత్త 18,44-46

}}

1. ఈ రెండుపమానాలు కవలపిల్లల్లాంటివి. వీటి భావం ఒకటే. జీతగాడు, వ్యాపారి నిధినీ ఆణిముత్యాన్నీసంపాదించుకోవడానికి తమకున్నవన్నీ వదలుకొని వెంటనే పనికి పూనుకొన్నారు. ఈలాగే మనం కూడ దైవరాజ్యాన్ని సంపాదించుకోడానికి ఎంత త్యాగమైన చేసి వెంటనే కార్యానికి పూనుకోవాలి.

2. ఈ రెండు కథల్లో జీతగాడు వ్యాపారి నిధికీ ముత్యానికీ యిచ్చిన విలువ, వాటి కొరకు వాళ్ళ చేసిన త్యాగం, వాటిని సంపాదించడంలో వాళ్ళనుభవించిన ఆనందం ముఖ్యాంశాలు. ఈలాగే మనం కూడ దైవరాజ్యానికి గొప్ప విలువనీయాలి. దాని కొరక సమస్తం త్యజించాలి. దాన్ని సాధించినపుడు మనకు పరమానందం కలుగుతుంది.

3. ఈ రెండు కథల్లోని నరులు నిధినీ ముత్యాన్నీ కనుగొన్నాక ఇక జాగు చేయలేదు. వెంటనే అన్నీ వదలుకొని వాటిని సంపాదించుకొన్నారు. మనం కూడ ఆలస్యం చేయకుండా దైవరాజ్యాన్ని శీఘమే సంపాదించుకోవాలి.