పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. మెస్సీయాను గూర్చిన సామెతలు

క్రీస్తు సామెతల్లో కొన్ని మెస్సీయాను గూర్చినవి. ఇవి ఆ మెస్సీయా రాకడనూ, అతని కాలాన్నీ అతని పనినీ, అతిని బోధలనూ వివరిస్తూంటాయి. ఈలాంటి ఉపమానాలు ఇంచుమించు తొమ్మిదున్నాయి. ఇవి కథలుగా అల్లబడిన పెద్ద సామెతలు కావు. చిన్న చిన్న ఉపమాన వాక్యాలు.

ఓమారు యోహాను తన శిష్యులను ప్రభువు వద్దకు పంపాడు. క్రీస్తుని గూర్చిన భోగట్టా సేకరించండని చెప్పాడు. వాళ్ళ క్రీస్తు వద్దకు వచ్చి "రానున్నవాడవు నీవేనా? అని అడిగారు. ఆ రోజుల్లో మెస్సీయా కోసం యూద ప్రజలంతా కాచుకొని ఉన్నారు. అతనికి రానున్నవాడని బిరుదం. ప్రభువు తాను చేసే పనులను యోహాను శిష్యులకు ఎరుకపరచాడు. గ్రుడ్డివాళ్లు చూపు పొందుతున్నారు. కుంటివాళ్లు నడుస్తున్నారు. చెవిటివాళ్లు వింటున్నారు. రోగులు స్వస్టులౌతున్నారు. మృతులు సజీవులౌతున్నారు. పేదలకు సువార్త బోధింపబడుతుంది. మెస్సీయా వచ్చినపుడు ఈలాంటి మహత్తర కార్యాలు చేస్తాడని యెషయా ముందుగనే ప్రవచించాడు - 35,5. కనుక ఈ కార్యాలను బట్టి తానే మెస్సీయా అని యెహాను గుర్తించాలని క్రీస్తు భావం - లూకా 6,20-23. ఈ మెస్సీయాను వర్ణించేవే మెస్సీయా సామెతలు. ఇక ఈ క్రింద ఈ వర్గం సామెతలను పరిశీలిద్దాం.

1. పెండ్లి కుమారుడు - మత్త 9,15

ఓమారు యోహాను శిష్యులు క్రీస్తు వద్దకు వచ్చి మేము ఉపవాసం చేస్తుంటే మిూ శిష్యులు చేయడం లేదేమి అని ప్రశ్నించారు. వారికి సమాధానంగా ప్రభువు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలమూ పెండ్లికి వచ్చిన వాళ్లు ఉపవాసం చేయరుగదా అన్నాడు. ఇక్కడ పెండ్లికుమారుడు క్రీస్తే, పెండ్లి విందుకు వచ్చినవాళ్ళు అతని శిష్యులు. కనుక క్రీస్తు తమతో ఉన్నంతకాలం శిష్యులు ఉపవాసం చేయనక్కర లేదు. యూదుల భావం ప్రకారం వివాహం ఆనందాన్నీ రక్షణనూ సూచిస్తుంది - దర్మ 19,7. మెస్సీయాయైన క్రీస్తు రక్షణను గొనివచ్చాడు. ఆ రక్షణం ఓ వివాహం లాంటిది. పెండ్లికుమారుడైన క్రీస్తు తమతో ఉన్నంతకాలమూ శిష్యులు సంతోషించాలే గాని విచారంతో ఉపవాసం చేయకూడదు.

పూర్వవేదం యావే ప్రభువును భర్తతోను యిస్రాయేలు ప్రజలను భార్యతోను పోలుస్తుంది. "నిన్ను సృజించిన ప్రభువే నీ భర్త" అంటాడు యెషయా - 54,5, నూత్నవేదంలో కూడ ఈ భావం సకృత్తుగా కన్పిస్తుంది. ప్రస్తుత సామెత ఈ సందర్భానికి .