పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోరిక. కాని స్వదేశీయులు అతడు తమకు రాజు కాగూడదని పై రాజుకి రాయబారం పంపారు. ఐనా ఆ రాజు అనుగ్రహం వల్ల అతనికి రాజ్యం లభించింది. అతడు రాజైన వెంటనే తనకు వ్యతిరేకంగా రాయబారమంపినవారిని పట్టి చిత్రవధ చేసాడు. క్రీస్తు చెప్పిన ఈ సామెతకు ఒక చారిత్రక సంఘటనం ఆధారం. క్రీస్తు పూర్వం నాల్గవయేడు పెద్ద హేరోదు రాజు చనిపోయాడు. వెంటనే అతని కుమారుడు అర్కె లావస్ సీజరు అనుగ్రహాన్ని పొంది తండ్రికి మారుగా తాను పాలస్తీనాకు రాజు కావడానికై రోము వెళ్ళాడు. కాని అతడు తమకు రాజు కాగూడదని యాభైమంది యూదనాయకులు రోముకు రాయబారమంపారు. అర్మెలావసు రాజపదవిని పొంది తిరిగి వచ్చాక ఈ యాభైమందిని పట్టి ముక్కముక్కలుగా తరిగించాడు. పై సామెతను చెప్పినపుడు ఈ సంఘటనం క్రీస్తు మనస్సులో వుంది.

3. భావం

ఆ రాజు తలవని తలంపుగా తిరిగివచ్చి తనకు విరోధులైన వాళ్ళను పట్టి శిక్షించాడు. అలాగే దేవుడు కూడ న్యాయనిర్ణయం జరిగించడానికి హఠాత్తుగా వేంచేస్తాడు. కనుక ప్రజలు సిద్ధంగా ఉండాలి. క్రీస్తు బోధలను ఆలించి దైవరాజ్యాన్నిఅంగీకరించాలి. లేకపోతే శిక్షకు పాత్రులౌతారు. ఇది క్రీస్తు ఉద్దేశించిన భావం.

7. వల - మత్త 13, 47-50

8. గోదుమలు, కలుపు - మత్త 13, 24-30

1. సందర్భం

దేవుడు కడపటి దినాన తీర్పు జరిపి మంచివాళ్ళనూ, చెడ్డవాళ్ళనూ వేరుపరుస్తాడు. ఈ రెండింటి భావం ఒకటే గనుక రెండిటికీ కలిపే వ్యాఖ్య చెప్పవచ్చు

2. వివరణం

పాలస్తీనా దేశానికి ముఖ్యమైన బ్రతుకు తెరువు గలిలయ సరస్సు చాలామంది యూదులు దానిలో చేపలు పట్టుకొని బ్రతికేవాళ్లు తరచుగా రెండూమూడు పడవల వాళ్ళ కలసి చేపలు పడుతుండేవాళ్లు, ఈ కథలో రెండు పడవలవాళ్ళు కలసి ఓ పెద్ద లాగుడు వలను ఉపయోగించారు. ఓ పెద్ద వలను విసరి దాన్ని రెండు వైపుల నుండి ఒడ్డుకి లాగుకొని వస్తారు. అది రకరకాల జల ప్రాణాలను ఈడ్చుకొని వస్తుంది. క్రీస్తునాడు ఆ సరస్సులో 24 రకాల చేపలు దొరికేవట. కాని ఇవన్నీ తినదగినవి కావు - లెవి 11, 10-11. కావున చేపలు పట్టేవాళ్లు మంచివాటిని ఏరి బుట్టల్లో వేసికొంటారు. పాడు