పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. భావం

యజమానుని ధనాన్ని నిరర్థకంగా ఉంచివేసిన ఈ మూడవ సేవకుడు ఎవరు? క్రీస్తు ఈ సామెతను చెప్పినప్పడు యూద నాయకులను మనస్సులో ఉంచుకొని మాట్లాడాడు. పరలోకంలోని తండ్రి ఆ నాయకులకు మోషే ధర్మశాస్తాన్ని ప్రసాదించాడు. అది దేవుని వాక్కు దేవుని సందేశం. కాని యూదనాయకులు దుషులై ఆ సందేశాన్ని ప్రజలకు అందీయడం లేదు. దాన్ని వ్యర్థం చేస్తూన్నారు. కనుక వాళ్ళు ఈ సోమరిపోతులాగే శిక్షకు పాత్రులౌతారు. ఇది క్రీస్తు ఉద్దేశించిన భావం.

ఈ సామెతను మత్తయి లిఖించినపుడు అతడు దీన్ని ఆనాటి క్రైస్తవ సమాజానికి అన్వయింపజేసాడు. కనుక దీనిలో కొలదిగా మార్పు వచ్చింది. క్రైస్తవ నాయకులు దైవవాక్కును ప్రజలకు విన్పించకుండా సోమరులై పోతున్నారు. ఆ యజమానుళ్ళాగే ప్రభువు కూడ మళ్ళా రెండవ మారు విజయం చేస్తాడు. లెక్క అడుగుతాడు. అప్పడు సోమరిపోతులైన నాయకులు శిక్షకు గురౌతారు. కనుక నాయకులు సరిగా వేదబోధ చేస్తూ ప్రభువు రాకడకు సిద్ధంగా ఉండాలి — ఇది సువిశేషకారుడు ఉద్దేశించిన భావం.

3. అన్వయం

ప్రభువు మన కందరికీ ఏవో కొన్ని శక్తిసామర్థ్యాలు ఇస్తూంటాడు. కొందరికి ఎక్కువా కొందరికి తక్కువా ఉంటాయి గాని, శక్తిసామార్థ్యాలేమో అందరికి ఉంటాయి. మనం వీటిని సద్వినియోగం చేసికోవాలి. సోమరితనంగా ఉండిపోతే ప్రభు శిక్షకు పాత్రులమౌతాం. కష్టపడి పనిచేసేవాడు దేవుని యెదుటా నరుల యెదుటా కూడ మన్నన పొందుతాడు. ఈ దృష్టితో చూస్తే క్రీస్తు చెప్పిన అతిశ్రేష్టమైన సామెతల్లో ఇదీ వొకటి అనాలి. మన యువతకు నాయక లక్షణాలను బోధించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

6. రాజ్యం సంపాదించుకోగోరినవాడు — లూకా 19, 12–27.

1. సందర్భం

పై ముగ్గురు సేవకుల సామెతనే లూకా కొంచెం మార్పులతో చెప్పాడు. ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే అతడు రెండు వేరువేరు సామెతలను ఒక్కటిగా కలిపివేసాడు. కొన్ని సామెతల్లో ఈలా జరిగింది. పై ముగ్గురు సేవకులు సామెతలో లూకా కలిపివేసిన క్రొత్త సామెతను మాత్రం ఇక్కడ పరిశీలిద్దాం.

2. వివరణం

ఒకడు తన జన్మదేశం నుండి బయలు దేరి మరో దేశంలో వున్న ఓ పెద్దరాజు వద్దకు వెళ్ళాడు. ఆ రాజు సహాయంతో తాను జన్మదేశానికి రాజు కావాలని అతని