పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. అధికారము గల సేవకుడు - మత్త 24, 45-51

1. వివరణం

ఓ యజమానుడు తన సేవలకుందరి మిూద ఓ ప్రధాన సేవకుణ్ణి అధికారిగా నియమించి వెళ్ళిపోయాడు. అతడు ఎక్కడికో వెళ్ళి కొంత కాలమయ్యాక తిరిగివచ్చాడు. అలా వచ్చినపుడు అధికారంలో వున్న సేవకుడు యోగ్యంగా ప్రవర్తించి వుంటే అతనికి సంభావనం లభిస్తుంది. అతడు అయోగ్యంగా ప్రవర్తించి తన క్రింది సేవకులను బాధించి వుంటే, శిక్ష పడుతుంది.

2. భావం

క్రైస్తవ సమాజంలో అధికారంలో ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా మెలగాలి. ప్రభువు ఎప్పడు వస్తాడో మనకు తెలియదు. కాని అతడు వచ్చినపుడు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లయితే వాళ్ళకు కఠినశిక్ష ప్రాప్తిస్తుంది. 3. అన్వయం కాపరులు మందకోసం గాని మంద కాపరుల కోసం గాదు. అందుచేత క్రైస్తవ సమాజంలో పెద్దలూ అధికారులూ ఐనవాళ్లు క్రైస్తవ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలి. అంతేగాని ప్రజల నుండి మాకేమి లాభం కలుగుతుందా అన్నట్లు ప్రవర్తించగూడదు.

4. పదిమంది కన్యలు - మత్త 25, 1-13

1. వివరణం

యూదుల పెండ్లి రాత్రిపూట జరిగేది. రాత్రి ప్రొద్దు పోయినంక వరుడు మిత్రులతో వధువు ఇంటికి వెత్తాడు. అక్కడివాళ్ళంతా వరుణ్ణి ఆహ్వానిస్తారు. అతడు దివిటీలతో మేళతాళాలతో వధువుని తన యింటికి తీసికొని వస్తాడు. తన యింటనే ఆమెను రాత్రిలో పెండ్డాడతాడు.

ఈ సామెతలో పదిమంది కన్నెలు వధువు పుట్టినింటిలో వేచివున్నట్లుగా భావించుకోవాలి. వాళ్లు వధువుని వరుని పుట్టినింటికి తీసికొని వెళ్ళాలి. వారి చేతుల్లోనివి దీపాలు గాదు, కాగడాలు. ఇవి ఒకసారి నూనెపోస్తే ఇంచుమించు పదిహేను నిమిషాలపాటు వెలిగేవి.

వరుడు వధువుని తీసుకపోవడానికి ఇంకా రాలేదు. ఆలస్యం చేసాడు. జాగు దేనికంటే వరుని తరపవాళ్ల వధువుకీ ఆమె బంధువులకీ కానుకలూ కట్నాలూ ఇచ్చుకోవాలి. ఏమేమి కానుకలీయాలి అనే సమస్య అంత సులభంగా తెమలేది కాదు. కనుక యూదుల