పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుష్టుడై నాబోతు ద్రాక్షతోటను అపహరించాడు. దానివల్ల అతని భార్యను అపహరించినంత పాపం కట్టుకున్నాడు - 1 రా 21, 1-16, ద్రాక్షసారాయం నరుల హృదయాలను సంతోష పెడుతుంది అంటుంది కీర్తన 104,15.

29. ద్రాక్షతోట యూదుల సంస్కృతితో మిళితమైపోయింది. ఆ ప్రజలు ఓ ద్రాక్షతోట లాంటివాళ్ళ వాళ్ళు కొలిచే యావే ఆ తోటను పెంచే కాపలాంటివాడు. కాని ప్రజలు దుష్టహృదయంతో ప్రభువును ఆరాధించటం మానివేసారు. అంచేత బీడుపడిన తోటలా పాడయిపోయారు. ఈ యంశాన్నే యెషయా ప్రవక్త తన ప్రవచనం 5వ అధ్యాయంలో మనోహరంగా వర్ణించాడు. ప్రభువు ఓ కొండమీద నేలను త్రోవ్వి, రాళ్లను ఏరి, ద్రాక్షతోట నాటించాడు. అది మంచి పండ్లు ఫలిస్తుందని గంపెడాశతో ఎదురు చూచాడు. కాని ఆ తోట చివరకు పిచ్చికాయలు కాసింది. ప్రభువు ఆగ్రహంతో దాని కంచెను నరికివేసాడు. గోడ పడగొట్టాడు. గొడ్డుగోద మొక్కలను తొక్కివేసాయి. తోటను మేసిపోయాయి. దానిలో గచ్చపొద లెదిగాయి. ఆ విధంగా ప్రభువు తోట పాడువడింది. ప్రవక్త ఈ యుపమానం వివరించి “యిస్రాయేలు వంశము సైన్యముల కధిపతియైన యావే ద్రాక్షతోట" అని చెప్పి ముగించాడు. యూదుల్లో నీతి నియమాలు అడుగంటి పోవడంవల్ల పాడయిపోయిన ద్రాక్షతోటలాగ తయారయ్యారని భావం - 5,7.

30. యిర్మీయా ప్రవక్తగూడ ఈ వుపమానాన్ని ఎత్తుకున్నాడు. ప్రభువు తన ప్రజనుద్దేశించి "నేను నిన్ను మేలుజాతి ద్రాక్షతీగనుగా నాటానుగదా, కాని నీవు పాడు రకపు తీగగా యేలా తయారయ్యావు?" అని అడుగుతాడు - 22,21. "ఆ తోటను నాశం చేయండి. ఆ చెట్ల కొమ్మలను నరికివేయండి." అంటాడు-5,10. యెహెజ్నేలు ప్రవక్తగూడ ఈ వుపమానాన్ని అందుకున్నాడు. ప్రభువు యిప్రాయేలు నుద్దేశించి “నీ తల్లి నీటిచెంత నాటబడిన ద్రాక్షతీగలాంటిది. అది ఆకుదొడగి కాయలు కాచింది” అంటాడు. కాని యీ చెట్టు సత్ఫలితాన్ని ఈయదు. అంచేత ప్రభువు ఆజ్ఞపై దాన్ని పెరికివేసి నేలమీద పడవేస్తారు, తూర్పుగాలిసోకి దాని ఆకులూ కాయలూ యెండిపోతాయి - 19,10-12. ఈలా యిస్రాయేలు సమాజం యూవేను విడనాడడంవల్ల పాడుపడిన తోటలా తయారౌతుంది, ప్రభువు శాపానికి గురై నాశమైపోతుంది.

31. కాని ప్రభువు ద్రాక్షతోట మీద మల్లా దయజూపుతాడు. తానే స్వయంగా ఆ తోటను కాపాడుతాడు. “యూవేనైన నేనే దానికి కాపుగాస్తాను. ఆకులు రాలిపోతాయేమోనని ప్రతిక్షణం దానికి నీరు కడతాను. దివారాత్రులు దానికి కాపలా వుంటాను" అంటాడు - యెష 27,3. ఎనబైయవ కీర్తన వ్రాసిన రచయిత భావాల