పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నచ్చదు, ఉల్లాస జీవితమూ నచ్చదు. ఏదో నెపంతో వాళ్ళ స్నాపక యోహానునీ క్రీస్తనీ కూడ విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శ చిన్నపిల్లల విమర్శలాగా అర్థరహితంగా ఉంది.

మగపిల్లల జటూ ఆడపిల్లల జటూ సంత వీధిలో ఆడుకొంటూ ఒకరినొకరు విమర్శించుకొంటున్నారు. మగపిల్లలు "మేము పిల్లనగ్రోవి ఊదితే విూరు నాట్యం చేయడం లేదు. ఆట చెడగొట్టివేసారు" అని ఆడపిల్లలను నిందిస్తున్నారు. అలాగే ఆడపిల్లలూ "మేము విలాపాలు ప్రారంభిస్తే మిూరు రొమ్ము బాదుకోలేదు, ఆట చెడగొట్టారు" అని మగపిల్లలను నిందిస్తున్నారు. ఈ చిన్నపిల్లల్లాగే యూద నాయకులు గూడ అర్థరహితంగా యెహానునీ క్రీస్తునీ దూయబడుతున్నారు. వాళ్లు దేవుడు పంపిన బోధకుల బోధలు వినేదీలేదు, పశ్చాత్తాపపడేదీ లేదు. విజ్ఞానవంతుడైన దేవుడు తాను మెస్సియ ద్వారా చేసే అద్భుతాలను చూచైనా దైవరాజ్యం సమిూపించిందని ప్రజలు ఎందుకు గుర్తించగూడదు? ఈ వృథా విమర్శల వల్ల ఏమి ఫలితం? ఇది సామెత భావం.

2. అన్వయం

మనకు ఇష్టం కానప్పడు ఏదో నెపం ಮೆಟ್ಟಿ ఇతరులను ఖండిస్తూంటాం, కాని ఇది పద్ధతి కాదు. మన హృదయాన్ని సరిదిద్దుకోవాలి. మన లోపాలను సవరించుకోవాలి. ఇతరులను తిడితే లాభం లేదు.

11. ఉపమాన వాక్యాలు

పైన పేర్కొన్నవన్నీ విస్తృతి చెందిన పెద్ద సామెతలు. ఇవికాక కేవలం ఉపమాన వాక్యాలు కూడ కొన్ని ఈ వర్గం సామెతల్లో ఉన్నాయి. ఇవి పైవాటిలాగ విస్తృతి చెందలేదు. ఐనా ఇవి కూడ సామెతలే. ప్రస్తుతానికి వీటిల్లో కొన్నింటిని మాత్రం పరిశీలిద్దాం.

1. పండ్లను బట్టి చెట్టును గుర్తించాలి — మత్త 7, 16-20. ఉమ్మెత్తకాయలు కాస్తే అది వెధవచెట్టు. మామిడికాయలు కాస్తే అది మంచి చెట్టు. అలాగే నరులు చేసే పనులను బట్టి వాళ్ళేలాంటివాళ్ళి తెలిసికోవచ్చు. అందరూ మాటలు తీయగానే చెప్తారు. చేతల వల్ల గాని మన సారం తెలియదు.

2. వాతావరణ చిహ్నాలు కాలగతులను తెలియజేస్తాయి. పడమట మబ్బులేస్తే వాన వస్తుందని గుర్తు, దక్షిణం నుండి గాలివీస్తే వడగాలి వస్తుందని గుర్తు, అలాగే మెస్సియా చేసే అద్భుతాలను బట్టే మెస్సియా కాలం ఆసన్నమైందని గుర్తించాలి. కాని యూదనాయకులు అలా గుర్తించడం లేదు — లూకా 12,54-56.

3. యూదనాయకులు గ్రుడ్డివాళ్లు, గ్రుడ్డివాడు గ్రుడ్డివాడ్డి నడిపిస్తే ఇద్దరూ గోతిలో పడతారు. అలాగే యూదనాయకులు కూడ తాము క్రీస్తుని అంగీకరింపనూ