పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. కాపుపట్టని అంజూరం - లూకా 13, 6-9

1. సందర్భం

నరులకు ఎప్పటికప్పుడు హృదయ పరివర్తనం అవసరం. పరివర్తనం చెందనివాళ్ళ నాశమైపోతారు అనడానికి నిదర్శనంగా ప్రభువు ఈ ఉపమానం చెప్పాడు - 13,5.

2. వివరణం

యూదులు ద్రాక్షతోటల్లో పండ్ల చెట్లు కూడ నాటేవాళ్ళ ఇవి ద్రాక్షలకు నీడనిచ్చేవి. మొక్కను నాటిన మూడేండ్ల దాకా అత్తిచెట్టు పండ్లు తినకూడదు. నాల్గవ యేడు దాని పండు దేవునికి అర్పించాలి. ఐదవయేడు వాటిని భుజించవచ్చు - లేవీ 19, 23. కాని ఈ సామెతలోని యంజూరం ఆరెండ్లయినా కాయలు కాయలేదు. ఇక కాస్తుందనే ఆశ కూడ లేదు. పైగా అత్తిమ్రాను పొదలాగ గుబురుగా ఎదిగి భూమిలోని తేమనూ సారాన్ని లాగివేస్తుంది. దాని చుటూ వున్న ద్రాక్షలు అవిసిపోతాయి. కనుక దాన్ని నరికివేయడమే ఉచితం అనుకొన్నాడు తోటకాపు, యూదులు మామాలుగా పండ్ల చెట్లకు ఎరువు వేసేవాళ్లు కాదు. ఇక్కడ ఈ తోటమాలి ఈ యంజూరానికి ఎరువు వేస్తానన్నాడంటే అతడేదో అసాధారణమైన కార్యం చేయబూనినట్లే భావించాలి. యజమానుడు మాత్రం ఆ వెర్రి చెట్బకు ఇంకొక యేడు గడువిచ్చాడు. మరో ఏడాది పాటు చూచి దాన్ని నరికివేద్దామనుకొన్నాడు.

3. భావం

పూర్వవేద రక్షణచరిత్రలో మెస్సియాకాలం కడపటిది. ఈ చివరి గడియల్లో క్రీస్తే స్వయంగా వచ్చి బోధిసూన్నాడు. పరివర్తనం చెంది దైవరాజ్యంలో చేరమని యూదులను ఆహ్వానిస్తున్నాడు. తన బోధను అంగీకరించక పోతే వాళ్లు సర్వనాశనమై పోతారని హెచ్చరిస్తున్నాడు. కాని వాళ్లు అతని బోధను లక్ష్యం చేయడం లేదు. ఆ వెర్రి అంజూరం లాగే వాళూ పరివర్తనం అనే పండ్లు కాయడం లేదు. దానికి ఒక యేడాది గడువు లభించింది. వీళ్ళను కూడ పరలోక ప్రభువు ఇంకా కొద్దిరోజుల పాటు సహించి ఊరుకుంటాడు. తర్వాత వీళ్లు దైవకోపాగ్నికి గురౌతారు.

4. అన్వయం ఈ కథలోని తోటమాలి ఒక విధంగా క్రీస్తుని సూచిస్తాడు. అతడు ఆ చెట్టు తరపున తోట యజమానునీ మనవి చేసినట్లే ప్రభువు తన తరపున పరలోకంలోని తండ్రిని మనవి చేసూంటాడు - హెబ్రే 7,25. కాని మన తరపున మనం ఆ దేవుణ్ణి