పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అప్పడు నీటి వెల్లవవచ్చి తలవని తలంపుగా జనాన్నందరినీ మంచివేసింది - మత్త 24, 38-39. ఆ ప్రజల్లాగే మనంకూడ వట్టి ప్రాపంచిక జీవితం జీవించకూడదు. డబ్బు దానంతట అద చెడ్డదికాదు. కాని డబ్బు కూడబెట్టుకోవడమూ సుఖభోగాలు అనుభవించడమూ మాత్రమే జీవిత పరమావధి అనుకోగూడదు. అవి నరుడ్డి మోసగిస్తాయి. పైగా ధనరీత్యా భాగ్యవంతులైయుండి దేవుని దృష్టిలో భాగ్యవంతులు కాకపోతే ఏమి లాభం? -12, 21. కనుక అవకాశ మండగనే మెస్సీయా ప్రభువుని అంగీకరించాలి. అతని బోధలను పాటించి జీవితం దన్యం చేసికోవాలి.

7. ముఖ్యాసనాలు -లూకా 14, 7-11

1. సందర్భం

యూదులకు తరచుగా విందులు జరుపుకొనే ఆచారం ఉంది, క్రీస్తూ కూడా అప్పడప్పుడు ఈ విందులకు వెళూండే వాడు. అలా వెళ్ళినపుడు అతడు యూదనాయకుల్లో ఓ దురుణం చూచాడు. వాళ్ళ విందుల్లో ముఖ్యాసనాల కోసం ఎగబడేవాళ్లు - లూకా 11, 43. ఈ దురభ్యాసాన్ని మనసులో పెట్టుకొని ప్రభువు ఈ సామెత చెప్పాడు.

2. భావం

ఈ సామెత, విశేషంగా "తన్నుతాను తగ్గించుకొనే వాడు" అనే 11వ వచనం, వినయాన్ని బోధిస్తున్నట్లుగా కన్పిస్తుంది, కాని ఇందలి ప్రధాన భావం ఇది కాదు. యూదులు స్వర్గాన్నీ దైవరాజ్యాన్నీ విందుతో పోల్చేవాళ్ళు ఈ దైవరాజ్యం అనే విందుకు మనలను ఆహ్వానించేవాడు ప్రభువే. మన జీవితం ఆ యాహ్వానాన్ని అందుకోవడానికి తగినట్లుగా ఉండాలి. మనం మెస్సియాను అతని బోధలను అంగీకరించి అతడు సిద్ధంచేసే విందులో పాల్గొనాలి. అంటే దైవరాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలి - ఇది ఈ సామెత భావం. తర్వాత దీనికి వినయం అనే అర్థం వచ్చేలా 11వ వచనం చేర్చారు. కాని ఈ 11వ వచనం ఇంకా ఇతర సందర్భాల్లో కూడ కన్పిస్తుంది — లూకా 18, 14 మత్త 18,4.

3. అన్వయం

దైవరాజ్యంలో చేరాలి అంటే మన చేతగానితనాన్ని గుర్తించి ఓ చిన్నబిడ్డలాగ ఆ ప్రభువు మీద ఆధారపడాలి, అతడు ప్రసాదించే రక్షణాన్ని ఆశతో స్వీకరించాలి. ఇలాంటి వినయాత్మలను ఆ ప్రభువు తప్పక కరుణిస్తాడు. అతడు అధిపతులను ఆసనాలమీదినుండి క్రిందికి పడదోసేవాడూ, దీనులను దుమ్ములోనుండి పైకి లేవనెత్తేవాడూను- లూకా 1, 52.